News February 18, 2025
రక్తాన్ని అందుబాటులో ఉంచుతాం: నంద్యాల కలెక్టర్

అత్యవసర వైద్యం కోసం నంద్యాలకు వచ్చే వారి కోసం రెడ్‌క్రాస్ ద్వారా రక్తం అందుబాటులో ఉంచుతామని నంద్యాల కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. కేసీ కెనాల్ కాంపౌండ్‌లోని మైనర్ ఇరిగేషన్ కార్యాలయ సమూహంలో ఏర్పాటు చేయబోయే రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. అక్కడి ఇంజనీర్లు, కమిటీ సభ్యులకు ఆమె పలు సూచనలిచ్చారు.
Similar News
News December 2, 2025
ఏపీ వాట్సాప్ గవర్నెన్స్‌కు అత్యధిక హిట్స్

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్‌కు తొలిసారిగా అత్యధిక హిట్స్ టీటీడీ వల్ల వచ్చింది. నవంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన డిప్ సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం చూస్తే 1.5 లక్షల మంది భక్తులు తమ పేర్లు ఈ డిప్లో వాట్సప్ ద్వారా నమోదు చేసుకున్నారు. ఈ సేవ వచ్చిన తర్వాత 3 రోజుల్లో ఇన్ని హిట్స్ రావడం ఇదే అత్యధికమని అంటున్నారు.
News December 1, 2025
PDPL: ఎన్నికల ఏర్పాట్లలో లోపాలు లేకుండా చూడాలి: కలెక్టర్

పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాల ర్యాండమైజెషన్‌ను పరిశీలించిన ఆయన, సిబ్బంది కేటాయింపు నిబంధనల ప్రకారం ఉండాలని తెలిపారు. నామినేషన్లు టి–యాప్‌లో నమోదు చేయాలని, అవసరమైన సామగ్రి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్లు, బ్యాలెట్ బాక్సులు సమయానికి అందించాలని సూచించారు.
News December 1, 2025
చలికాలం స్వెటరు వేసుకుని పడుకుంటున్నారా?

చలికాలం కొందరు స్వెటరు వేసుకుని పడుకుంటారు. అయితే దానికి బదులు కాటన్, లెనిన్, బ్రీతబుల్ దుస్తులు మంచివని నిపుణులు సూచిస్తున్నారు. ‘స్వెటరే వేసుకోవాలి అనుకుంటే టైట్‌గా ఉండేది వద్దు. దాంతో బ్లడ్ సర్క్యూలేషన్ సరిగ్గా జరగదు. కాస్త లూజ్‌గా, పొడిగా, బ్రీతబుల్, శుభ్రంగా ఉండేది వేసుకోండి. వింటర్లో కాళ్లకు సాక్సులు వేసుకుంటే నిద్ర బాగా పడుతుంది. అవి కూడా శుభ్రంగా, కాస్త లూజ్‌గా ఉండాలి’ అని చెబుతున్నారు.


