News January 29, 2025
రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలి: మందమర్రి GM

మందమర్రి GM కార్యాలయంలో ఏరియా GM దేవేందర్, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ అధికారి రఘు కుమార్, ఏరియా ASOరవీందర్ ఆధ్వర్యంలో సేఫ్టీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అన్ని గనులు, డిపార్ట్మెంట్ సేఫ్టీ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. GM మాట్లాడుతూ.. ఎల్లప్పుడూ రక్షణతో కూడిన ఉత్పత్తి ఉత్పాదకతను సాధించాలని సూచించారు. పని స్థలాలను నిషితంగా పరిశీలించిన అనంతరం విధులు నిర్వహించడం మంచిదన్నారు.
Similar News
News November 23, 2025
కొత్తగూడెం: దుప్పి మాంసం కేసు.. రిమాండ్

అశ్వాపురం మండలం మిట్టగూడెంలో దుప్పిని వేటాడి మాంసం విక్రయించిన కేసులో ఇద్దరు నిందితులకు కొత్తగూడెం జిల్లా కోర్టు మేజిస్ట్రేట్ శనివారం 14 రోజుల రిమాండ్ విధించారు. మిట్టగూడేనికి చెందిన సప్కా వీరస్వామి, కనితి కన్నయ్యలను శుక్రవారం రాత్రి దుప్పి మాంసంతో సహా అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని జిల్లా కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ ఉత్తర్వులు జారీ చేశారు.
News November 23, 2025
ములుగు: నేడు సర్పంచ్ రిజర్వేషన్ జాబితా విడుదల..!

సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ రాత్రి వరకు జరిగింది. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో 10 మండలాల్లోని 146 గ్రామపంచాయతీలకు రిజర్వేషన్లను అధికారులు నిర్ణయించారు. అనంతరం నివేదికను కలెక్టర్కు అందజేశారు. నేడు తుది జాబితాను కలెక్టర్ అధికారికంగా విడుదల చేయనున్నారు. అనంతరం ఇదే జాబితాను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
News November 23, 2025
GVMCలో అవినీతి ‘ప్లానింగ్’..!(1/1)

నిర్మాణ రంగం ఊపందుకుంటున్న విశాఖలోని GVMC <<18365028>>టౌన్ ప్లానింగ్<<>> విభాగంపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలోని అన్ని జోన్లలో దాదాపు పరిస్థితి ఒకేలా ఉంది. అనుమతులు, కంపౌండ్ వాళ్లు, ప్లాన్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు.. ఏ పనైనా “ధనం ఉంటే వెంటనే-లేకపోతే నెలల తరబడి లేటు” అన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా, నిబంధనలు పట్టించుకోకుండానే కొన్ని భవనాలకు అనుమతులు ఇస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.


