News January 29, 2025

రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలి: మందమర్రి GM

image

మందమర్రి GM కార్యాలయంలో ఏరియా GM దేవేందర్, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ అధికారి రఘు కుమార్, ఏరియా ASOరవీందర్ ఆధ్వర్యంలో సేఫ్టీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అన్ని గనులు, డిపార్ట్మెంట్ సేఫ్టీ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. GM మాట్లాడుతూ.. ఎల్లప్పుడూ రక్షణతో కూడిన ఉత్పత్తి ఉత్పాదకతను సాధించాలని సూచించారు. పని స్థలాలను నిషితంగా పరిశీలించిన అనంతరం విధులు నిర్వహించడం మంచిదన్నారు.

Similar News

News February 18, 2025

సూక్ష్మ సేద్యం సబ్సిడీలు ఇలా(1/2)

image

AP: ‘రాష్ట్రీయ కృషి వికాస్ యోజన – పర్ డ్రాప్ మోర్ క్రాప్’ స్కీమ్‌లో భాగంగా సూక్ష్మ సేద్యం కింద బిందు, తుంపర పరికరాలకు ప్రభుత్వం సబ్సిడీలు ఖరారు చేసింది. వీటికోసం సమీపంలోని వ్యవసాయ కేంద్రాల్లో సంప్రదించాలి. మొత్తంగా 7.5 లక్షల ఎకరాలకు పరికరాలు అందిస్తారు.
✒ 5ఎకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ సన్న, చిన్నకారు రైతులకు పరికరాలపై 100% సబ్సిడీ
✒ ఇతర సన్న, చిన్నకారు అన్నదాతలకు 90% సబ్సిడీ(గరిష్ఠంగా ₹2.18 లక్షలు)

News February 18, 2025

సూక్ష్మ సేద్యం సబ్సిడీలు ఇలా(2/2)

image

✒ రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5-10 ఎకరాల్లోపు రైతులు, గిరిజన అన్నదాతలకు 90% సబ్సిడీ(గరిష్ఠంగా ₹3.14 లక్షలు).
✒ కోస్తా జిల్లాల్లో 5-10 ఎకరాల్లోపు 70%(గరిష్ఠంగా ₹3.10 లక్షలు), పది ఎకరాలు పైబడిన వారికి 50 శాతం(గరిష్ఠంగా ₹4లక్షలు).
✒ అన్ని సామాజికవర్గాల్లో 5 ఎకరాల్లోపు తుంపర పరికరాలకు దరఖాస్తు చేసిన వారికి 50%(₹19వేలు), 12.5 ఎకరాల్లోపు వారికి 50 శాతం(₹19వేలు) సబ్సిడీ అందనుంది.

News February 18, 2025

MBNR: నలుగురు తహశీల్దార్లను బదిలీ చేసిన కలెక్టర్

image

జిల్లాలో పనిచేస్తున్న నలుగురు తహశీల్దార్లను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బదిలీ చేశారు. జడ్చర్ల తహశీల్దారు బ్రహ్మం గౌడ్ ను సెక్రటేరియట్ కు బదిలీ చేయగా ఆయన స్థానంలో కలెక్టరేట్లోని ఈ సెక్షన్ తహశీల్దారు నర్సింగ్రావును నియమించారు. కలెక్టరేట్ ఈ సెక్షన్ తహశీల్దార్‌గా అడ్డాకుల తహశీల్దారు మదన్మోహన్‌ను నియమించగా, సెక్రటేరియట్ నుంచి శేఖర్ అడ్డాకుల తహశీల్దారుగా నియమితులయ్యారు. వీరు బాధ్యతలు స్వీకరించారు.

error: Content is protected !!