News August 21, 2024
రక్షా బంధన్.. ఆర్టీసీకి భారీగా ఆదాయం

రక్షా బంధన్ పర్వదినం ఆర్టీసీకి కలిసొచ్చింది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో ఈ నెల 17 నుంచి 19 వరకు మొత్తం రూ.6.46 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మూడు రోజుల్లో మొత్తం 9,82,355 మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణించారు. మొత్తం రీజియన్ పరిధిలో ఈ నెల 17న రూ.1.89కోట్లు, 18న రూ.2.02కోట్ల ఆదాయం రాగా.. అత్యధికంగా ఈనెల 19న రూ.2.55కోట్ల ఆదాయం వచ్చింది.
Similar News
News July 5, 2025
విపత్తుల నిర్వహణ అందరి బాధ్యత: జాయింట్ అడ్వైజర్

విపత్తుల నిర్వహణ అందరి బాధ్యత అని జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాష్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ కింద ఏర్పాటైన ఆపదమిత్ర వాలంటీర్లు, జిల్లా అధికారులతో చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వరదలు, తుపాన్లు, భూకంపాలు, ప్రమాదాలు సంభవించినప్పుడు సహాయం చేసేందుకు జిల్లాలోనూ ఆపద మిత్రులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News July 5, 2025
బాలసదనం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: నల్గొండ కలెక్టర్

నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ రహదారిలో రూ.1.34 కోట్లతో నిర్మిస్తోన్న బాలసదనం పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. శనివారం ఆమె బాలసదనం నిర్మాణ పనులను పరిశీలించారు. బాలసదనం ఆవరణలోకి వర్షపు నీరు రాకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టాలన్నారు. పనులు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News July 5, 2025
విపత్తుల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సంసిద్ధం: నల్గొండ కలెక్టర్

విపత్తుల నిర్వహణకు నల్గొండ జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ అధికారులకు తెలిపారు. శనివారం అథారిటీ అధికారుల బృందం జాయింట్ అడ్వైజర్ నావెల్ ప్రకాశ్, అండర్ సెక్రటరీ అభిషేక్ బిశ్వాల్, వసీం ఇక్బాల్ బృందం రాష్ట్ర విపత్తుల నిర్వహణ అధికారి గౌతమ్ ఆధ్వర్యంలో నల్గొండ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్‌ను కలిశారు.