News June 26, 2024
రక్షిత మంచి నీటిని అందించేందుకు నిధులు కేటాయించాలి: సీతక్క

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్‌తో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద 10 లక్షల గృహాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు నిధులు కేటాయించాలన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 53.98 లక్షల గృహాలకు రక్షిత మంచినీరు అందుతుందన్నారు. కొత్తగా ఏర్పాటైన ఆవాసాలకు, కొత్తగా నిర్మించిన గృహాలకు నల్లాల ద్వారా మంచినీటి సరఫరాకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
Similar News
News February 19, 2025
జిల్లా కలెక్టర్లతో ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్

జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీరు, సాగునీరు, రైతు భరోసా తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణిలు పాల్గొన్నారు. జిల్లాలోని 75 ప్రభుత్వ సంక్షేమ శాఖల గురుకులాలు, వసతి గృహాలలో వినూత్నంగా విద్యార్థులకు డార్మిటరీలు ఫిర్యాదుల పెట్టే తీసుకొచ్చి చలికాలంలో వేడి నీరు అందించడం పై చర్చించారు.
News February 18, 2025
వరంగల్ మార్కెట్లో పలు ఉత్పత్తుల ధరల వివరాలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి మంగళవారం వివిధ రకాల ఉత్పత్తులు తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. 5,531 మిర్చి ధర రూ.11 వేలు పలకగా, దీపిక మిర్చి రూ.16,200, అకిరా బ్యాగడి రూ.11 వేల ధర పలికాయి. అలాగే నం. 5 రకం మిర్చి రూ.12 వేలు, ఇండికా మిర్చికి రూ.16,200, మక్కలు(బిల్టీ)కి రూ.2,311 వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
News February 18, 2025
వరంగల్: 16 ఏళ్ల తర్వాత నెరవేరిన కల!

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన చిలుముల రాములు తేజ దంపతుల కొడుకు ఏలియా. చిన్నతనం నుంచే టీచర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 2008 డీఎస్సీ అభ్యర్థులను కాంట్రాక్ట్ ఎస్జీటీలుగా నియమించింది. చిలుముల ఏలియాకు దాదాపు 16 ఏళ్ల తర్వాత ఉద్యోగం రావడంతో వారి ఆనందానికి హద్దులు లేవు. కొడుకు కల నెరవేరిందని సంతోష పడుతున్నారు.