News October 21, 2024
రఘునాథపల్లి: అన్నదమ్ములకు 7 ప్రభుత్వ ఉద్యోగాలు

ఓ రైతు కుటుంబంలోని అన్నాతమ్ముడు ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించుకున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన కౌడగాని మైసారావు-వినోధ దంపతులకు మధు, మనోజ్ ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మనోజ్కి 3, చిన్న కుమారుడు మధుకి 4 ఉద్యోగాలు సాధించారు. కొందరు ఒక ఉద్యోగం సాధించడానికి తంటాలు పడుతుంటే, వీరు మాత్రం రాసిన ప్రతి పరీక్షలో ఉద్యోగాన్ని సాధించడం గొప్ప విషయం.
Similar News
News November 15, 2025
వయోవృద్ధులను గౌరవిద్దాం: WGL కలెక్టర్

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తా నుంచి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు వయోవృద్ధుల వాకథాన్(ర్యాలీ) జరిగింది. కలెక్టర్ సత్య శారద ముఖ్యఅతిథిగా పాల్గొని, జెండా ఊపి ప్రారంభించారు. ఈనెల 19 వరకు జిల్లాలో వారోత్సవాలను నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.
News November 15, 2025
WGL: టెన్త్ పరీక్షల ఫీజు గడువు 20 వరకు పొడిగింపు

పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 20 వరకు పొడిగించినట్లు డీఈఓ రంగయ్య నాయుడు తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో 21 నుంచి 29 వరకు ఫీజులు చెల్లించవచ్చన్నారు. అన్ని సబ్జెక్టులకు రూ.125, మూడు సబ్జెక్టులకు రూ.110, 3 కంటే ఎక్కువైతే రూ.125, వొకేషనల్ వారికి అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఫీజులు కేవలం www.bse.telangana.gov.inలో లాగిన్ ద్వారా చెల్లించాలని సూచించారు.
News November 15, 2025
పాకాల: ధాన్యం కొనుగోళ్లలో కఠిన నిబంధనలు..!

వరంగల్ జిల్లా పాకాల ఆయకట్టు పరిధిలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాకుండానే రైతులకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. జల్లెడ వేసిన ధాన్యానికే టోకెన్లు ఇవ్వాలని ఉన్నతాధికారుల ఆదేశాలు రావడంతో రైతులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. తాలు, మట్టి, పాడైన ధాన్యం 5% లోపే ఉండాలన్న నిబంధనలు, మిల్లర్ల కేటాయింపు ఆలస్యం రైతులకు తలనొప్పిగా మారాయి. నిబంధనలు పాటించకపోతే కొనుగోలు చేయబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.


