News April 14, 2025

రఘునాథపల్లి: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

image

జనగామ జిల్లా రఘునాథపల్లి మండల పరిధిలోని గోవర్ధనగిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు ముందున్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో కారు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ ఐనప్పటికీ డ్రైవర్ మృతి చెందాడు. కారు వెనక సీట్లో కూర్చున్న ఇద్దరు మహిళలు కూడా అక్కడికక్కడే మరణించారు. మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 24, 2025

జిల్లాలో రాబోయే 5 రోజులు వర్షాలు

image

హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో జగిత్యాల జిల్లాలో తేలికపాటి నుంచి అతి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వాతావరణ పరిశీలన కేంద్రం టెక్నికల్ ఆఫీసర్ శ్రీలక్ష్మీ తెలిపారు. రైతులు కోసి ఎండబెట్టిన మొక్కజొన్న, సోయాచిక్కుడు పంటలను టార్ఫాలిన్ కవర్లతో కప్పడం లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని ఆమె సూచించారు.

News October 24, 2025

ధాన్యం నాణ్యత, రైతులకు సౌకర్యం ప్రధానం: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకంలో మోసాలు జరగకుండా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ధాన్యం నాణ్యత విషయంలో రాజీపడొద్దని, తరుగు విషయంలో రైతుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, తాత్కాలిక విశ్రాంతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

News October 24, 2025

బస్ ఎక్కకుండా ప్రాణాలు దక్కించుకున్నాడు

image

కర్నూలు ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే బస్సులో TGకి చెందిన 15 మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. వీరిలో తరుణ్ అనే యువకుడు మాత్రం చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకున్నారు. ఆయన సీట్ నంబర్ U-2లో టికెట్ బుక్ చేసుకున్నారు. HYD ప్యారడైజ్ వద్ద బోర్డింగ్ చేయాల్సి ఉండగా బస్ ఎక్కకుండా ప్రమాదం నుంచి సురక్షితంగా బయపడ్డారు. మిగతా 14 మందిలో 8 మంది మరణించారు.