News April 19, 2024
రఘుబాబు అరెస్టు.. గంటల వ్యవధిలోనే బెయిల్
టాలీవుడ్ నటుడు రఘుబాబు కారు ఢీకొని నల్గొండ BRS నేత సందినేని జనార్దన్ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రఘుబాబును అరెస్ట్ చేసి.. కోర్టులో ప్రవేశపెట్టారు. గంటల వ్యవధిలోనే ఆయన బెయిల్ పై విడుదలయ్యారు.
Similar News
News September 16, 2024
రూ.13.50 లక్షలు పలికిన నల్గొండ పాతబస్తీ లడ్డూ
నల్గొండ పాతబస్తీ హనుమాన్ నగర్ ఒకటో నంబర్ వినాయక లడ్డూ రూ.13.50 లక్షల వేలం పలికింది. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి వినాయక లడ్డూను కైవసం చేసుకున్నారు. కాగా గతేడాది పాతబస్తీ ఒకటో నంబర్ వినాయక లడ్డూ వేలం రూ.36 లక్షలు పలికింది.
News September 16, 2024
ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలతో ఆదివారం భువనగిరి పట్టణంలోని వివేరా హోటల్లో భేటీ అయ్యారు. ఈ భేటీలో జిల్లా రాజకీయాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, భూపాల్ రెడ్డి, బిక్షమయ్య గౌడ్, గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్, చిరుమర్తి లింగయ్య, భాస్కరరావు, రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.
News September 15, 2024
త్రిపురారం: మాజీ ఎంపీపీ భర్తపై కత్తితో దాడి
త్రిపురారం మాజీ ఎంపీపీ అనుముల పాండమ్మ భర్త అనుముల శ్రీనివాస్ రెడ్డిపై ఆదివారం సాయంత్రం ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. తాగిన మైకంలో ఉన్న యువకుడు ఓ విషయంలో న్యాయం చేయలేదంటూ శ్రీనివాస్ రెడ్డి పై దాడి చేయడంతో కడుపులో రెండు చోట్ల గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాదు తరలించారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.