News March 14, 2026

రఘు భాయ్.. ది రియల్ హీరో

image

టీమ్ఇండియా టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత నెట్టింట ఒకరి పేరు మారుమోగుతోంది. ఆయనే రాఘవేంద్ర (రఘు భాయ్). ఒకప్పుడు కేవలం ₹21తో ఇంటి నుంచి బయటకొచ్చి క్రికెట్ కోసం పోరాడిన ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి. నెట్స్‌లో గంటకు 150 కి.మీ వేగంతో బంతులు విసిరి, మన బ్యాటర్లను ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర కీలకం. అందుకే విరాట్ కోహ్లీ వంటి స్టార్లే ఆయనను టీమ్‌ఇండియాకు నిజమైన హీరోగా అభివర్ణిస్తున్నారు.

Similar News

News April 14, 2026

TODAY HEADLINES

image

⋆ 2029లోగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు: మోదీ
⋆ డీలిమిటేషన్‌పై ఏకాభిప్రాయం అవసరం: రేవంత్
⋆ ఈ నెల 22 నుంచి TGSRTC సమ్మె
⋆ TG TET, DOST నోటిఫికేషన్ విడుదల
⋆ ఎండలు.. రేపు 12PM-4PM మధ్య బయటకు వెళ్లకండి: APSDMA
⋆ AP: మే 1 నుంచి ఆన్‌లైన్‌లోనే పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ
⋆ IPL: RRపై SRH విజయం

News April 14, 2026

రాజస్థాన్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్

image

IPLలో భాగంగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో SRH 57 రన్స్ తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. భీకర టాపార్డర్ కాస్తా తొలి ఓవర్‌లోనే కుప్పకూలగా.. ఫెరీరా (69), జడేజా (45) వందకు పైగా భాగస్వామ్యం నమోదు చేశారు. చివరికి 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. వైభవ్, జురెల్, ప్రిటోరియస్ డకౌట్ కాగా, జైస్వాల్(1), పరాగ్(4) విఫలమయ్యారు. ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ చెరో 4 వికెట్లు తీశారు.

News April 14, 2026

యంగ్ ఏజ్‌లో అతిగా డ్రింక్ చేస్తే..

image

స్ట్రెస్ నుంచి బయటపడ్డానికి మద్యం సేవించే యూత్‌కు మసాచుసెట్స్ వర్సిటీ రీసెర్చర్లు షాకింగ్ న్యూస్ చెప్పారు. యంగ్ ఏజ్‌లో ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే మధ్యవయసుకొచ్చే సరికి మెదడు పనితీరు మందగిస్తుందని తేల్చారు. తర్వాత మానేసినా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తిరిగిరాదన్నారు. ఇది భవిష్యత్తులో జ్ఞాపకశక్తి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. అప్పుడు కోలుకోవడానికి ప్రత్యేక చికిత్సలు అవసరమని తెలిపారు.