News December 13, 2024

రచయిత కంచ ఐలయ్యకు హైకోర్టులో ఊరట

image

రచయిత కంచ ఐలయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. కోరుట్ల, కరీంనగర్, మల్కాజిగిరి PSలో కేసుతో పాటు పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులను హైకోర్టు కొట్టేసింది. ఆయన ఓ పుస్తకం రాయడంతో నమోదైన కేసులన్నీ రాజ్యాంగపరిధిలోని భావ వ్యక్తీకరణకిందికే వస్తాయని హైకోర్టు పేర్కొంది. పుస్తకాన్ని బ్యాన్ చేయాలనే కేసును సుప్రీంకోర్టు 2017లో తిరస్కరించినా, రచయితకు శిక్ష పడాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు.

Similar News

News November 23, 2025

తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో తెలంగాణ వంటల వారసత్వ వాక్

image

ప్రపంచ వారసత్వ వారోత్సవాల సందర్భంగా తెలంగాణ టూరిజం ‘తెలంగాణ వంటల వారసత్వ వాక్‌’ను చార్మినార్‌‌లో ప్రారంభించింది. వంటకాల రుచి, తయారీ పద్ధతులను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. తెలంగాణ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి, ఫుడ్ స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. వంటకాల రుచిని ఆస్వాదిస్తూ, వాటి వెనుక ఉన్న కథలను, చరిత్రను తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

News November 23, 2025

HYD: సమయం లేదు మిత్రమా.. పనులు చకచకా

image

మరో రెండువారాల్లో (డిసెంబర్ 8,9) ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానున్నసంగతి తెలిసిందే. దీంతో అధికారులు మీర్‌ఖాన్‌పేట వద్ద పనులు చకచకా చేయిస్తున్నారు. దాదాపు 120 ఎకరాలను చదును చేయిస్తున్నారు. పనులపై ఏరోజుకారోజు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అప్‌డేట్ ఇస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో పనుల్లో ఆలస్యం జరగరాదని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో నిరంతరం పనులు చేయిస్తున్నారు.

News November 23, 2025

HYD: వీకెండ్ డ్రంక్& డ్రైవ్‌లో 468 మంది దొరికారు

image

సైబరాబాద్‌లో వీకెండ్ డ్రంక్& డ్రైవ్‌లో 468 మంది పట్టుబడ్డారు. వాహనాల వారీగా 335 టూవీలర్లు, 25 ఆటోలు, 107 కార్లు, 1 హెవీ వెహికల్ సీజ్ చేశారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే ప్రమాదం జరిగితే BNS సెక్షన్ 105 కింద 10 ఏళ్ల జైలు శిక్ష వర్తిస్తుందని పోలీసులు హెచ్చరించారు. గత వారం 681 కేసులు డిస్పోజ్ కాగా.. 613 మందికి ఫైన్, 50 మందికి ఫైన్+ సర్వీస్, 18 మందికి ఫైన్+ జైలు శిక్ష విధించారు.