News December 13, 2024
రచయిత కంచ ఐలయ్యకు హైకోర్టులో ఊరట
రచయిత కంచ ఐలయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. కోరుట్ల, కరీంనగర్, మల్కాజిగిరి PSలో కేసుతో పాటు పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులను హైకోర్టు కొట్టేసింది. ఆయన ఓ పుస్తకం రాయడంతో నమోదైన కేసులన్నీ రాజ్యాంగపరిధిలోని భావ వ్యక్తీకరణకిందికే వస్తాయని హైకోర్టు పేర్కొంది. పుస్తకాన్ని బ్యాన్ చేయాలనే కేసును సుప్రీంకోర్టు 2017లో తిరస్కరించినా, రచయితకు శిక్ష పడాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు.
Similar News
News January 18, 2025
అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో ఆటో డ్రైవర్ విచారణ
అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో ఆటో డ్రైవర్‌ను పోలీసులు గుర్తించారు. అఫ్జల్ గంజ్ నుంచి సికింద్రాబాద్ వరకు దొంగలను ఆటో డ్రైవర్ తీసుకెళ్లారు. దొంగలను వదిలిపెట్టిన ఆటో డ్రైవర్‌ని అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్ద దొంగల్ని వదిలిపెట్టినట్టు ఆటో డ్రైవర్ విచారణలో తెలిపారు. ఆటోలో కూర్చున్నప్పుడు దొంగలు ఏమైనా మాట్లాడుకున్నారా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
News January 18, 2025
HYD: సినిమా ఛాన్స్ అంటూ యువతిపై లైంగిక దాడి
సినిమాల్లో ఛాన్స్ అంటూ ఇటీవల ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆడిషన్స్ పేరుతో ఆశ చూపించి గదికి పిలిచి ఓ దుండగుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన బాధితురాలి ఫిర్యాదు మేరకు అసిస్టెంట్ డైరెక్టర్ రాజు మీద BNS 64,79,115,351(2) కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
News January 18, 2025
HYD: త్వరలో 10 స్థానాలకు ఉప ఎన్నికలు: KTR
త్వరలో చేవెళ్ల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. చేవెళ్లతో పాటుగా పార్టీ మారిన 10 ఎమ్మెల్యేల స్థానాల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతాయని, ప్రజలందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలయ్యేంత వరకు BRS పార్టీ నిర్విరామంగా పోరాడుతుందని KTR అన్నారు. కాగా, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య BRS నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన సంగతి తెలిసిందే.