News November 21, 2024
రచ్చుమర్రి ఇసుక రీచ్‌ను సందర్శించిన జేసీ

కనేకల్ మండలం రచ్చుమర్రి గ్రామంలోని ఇసుక రీచ్‌ను బుధవారం జేసీ శివ నారాయణ శర్మ ఆకస్మికంగా సందర్శించారు. ఇసుక రీచ్‌లో కెమెరాల బిగింపు, ఇసుక నిల్వలు, తరలింపు ప్రక్రియ, తదితర వివరాలను ఆర్డీవో వసంత్ బాబు, భూగర్భ గనుల శాఖ ఏడీఏ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ ఫణికుమార్‌లను అడిగి తెలుసుకున్నారు. ఇసుక రీచ్‌పై టెండర్లు ఆహ్వానించినట్లు జేసీ పేర్కొన్నారు.
Similar News
News March 9, 2026
అనంత: YCP సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్

ITDP నాయకురాలు జె.రేణుక మీద సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన అనంతపురం (D) మద్దెలచెరువుకు చెందిన YCP సోషల్ మీడియా కన్వీనర్ మదిగుబ్బ అశోక్‌ను తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. TTD ఛైర్మన్ BR నాయుడు వ్యవహారంలో రేణుక మీద సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన అశోక్‌ను అరెస్ట్ చేసినట్లు CI నాయబ్ రసూల్ తెలిపారు. నిందితుడు సయ్యద్‌ను ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి విధితమే.
News March 9, 2026
మాజీ ఎంపీ తలారి రంగయ్యకు ప్రాణహాని: నారాయణ

కళ్యాణదుర్గం ఈ-స్టాంప్ కుంభకోణంపై హైకోర్టులో పోరాడుతున్న మాజీ ఎంపీ డా. తలారి రంగయ్యకు ప్రాణహాని ఉందని YCP నాయకులు నారాయణ, తిమ్మరాయుడు తెలిపారు. తక్షణమే ఆయనకు 2+2 పోలీసు భద్రత కల్పించాలని సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. స్కామ్ బాధ్యుల నుంచి రంగయ్యకు ముప్పు ఉందని ఆరోపించారు.
News March 9, 2026
అనంతపురం కలెక్టరేట్‌లో ‘రెవెన్యూ క్లినిక్’ నిర్వహణ

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం ‘రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ ఆనంద్ స్వయంగా అర్జీలను స్వీకరించారు. భూ వివాదాలు, సంక్షేమ పథకాలు, ఇతర పరిపాలనా పరమైన సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే నమోదు చేసి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ విష్ణుచరణ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


