News April 15, 2025

రజతోత్సవ సభతో వరంగల్‌లో BRS ఊపందుకోనుందా?

image

ఈనెల 27న WGL జిల్లాలో BRS రజతోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. 2018 ఎన్నికల్లో జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 BRS కైవసం చేసుకోగా.. ములుగు, BHPL కాంగ్రెస్ గెలిచింది. 2023లో అది కాస్తా తారుమారుగా జనగామ, స్టే.ఘ మాత్రమే BRS గెలిచి.. మిగతావన్నీ కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు BHPL MLA కాంగ్రెస్ నుంచి BRSలో, ఇప్పుడు స్టే.ఘ MLA BRS నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఈ సభతో జిల్లాలో మల్లీ BRS ఊపందుకోనుందా?

Similar News

News November 27, 2025

ఇలా పడుకుంటే మొటిమల ముప్పు

image

సాధారణంగా మన చర్మం విడుదల చేసే నూనెలు, చెమట, బ్యాక్టీరియాతో పాటు మృతకణాలూ దిండు పైకి చేరతాయి. దిండు కవర్లను తరచూ మార్చకపోతే మొటిమల ముప్పు ఉంటుంది. అలాగే మేకప్ తొలగించకపోవడం, బోర్లా పడుకోవడం, గదిలో ఉష్ణోగ్రత, హ్యుమిడిటీ ఎక్కువగా ఉండటం వల్ల కూడా చర్మం ఎక్కువ సీబమ్‌ను ఉత్పత్తి చేసి మొటిమలకు కారణమవుతాయి. కాబట్టి బెడ్‌రూంను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

News November 27, 2025

ASF: గ్రామ పంచాయతీ ఎన్నికలకు హెల్ప్‌లైన్ ఏర్పాటు

image

ఆసిఫాబాద్ కలెక్టరేట్‌ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సమాచారం, సందేహాల పరిష్కారం కోసం కలెక్టరేట్ పరిధిలో టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు (గురువారం)సాయంత్రం నుంచి అందుబాటులోకి రానుంది. ఓటింగ్, నామినేషన్లు, ఎన్నికల ప్రక్రియపై ప్రజలు ఈ నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అని అధికారులు పేర్కొన్నారు.

News November 27, 2025

మరో తుఫాన్.. ‘దిట్వా’గా నామకరణం

image

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. ఇది బలపడి తుఫానుగా మారితే యెమెన్ సూచించిన ‘దిట్వా’ అని నామకరణం చేస్తారు. దిట్వా అనేది యెమెన్ సోకోత్రా ద్వీపంలోని ఫేమస్ సరస్సు పేరు. సెన్యార్ ఏర్పడిన సమయంలోనే ఈ అల్పపీడనం కూడా ఏర్పడిందని IMD తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఏపీ వైపు కదులుతూ బలపడే ఛాన్స్ ఉందని చెప్పింది.