News June 12, 2024
రజనీకాంత్‌తో ముచ్చటించిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి సూపర్ స్టార్ రజనీకాంత్‌తో మంగళవారం మాట్లాడారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఉన్న రజనీని.. పాత పరిచయంతో కలిసి ముచ్చటించారు. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వస్తున్న ఆయనతో మాట్లాడుతూ.. ‘సార్.. గతంలో మీరు చంద్రబాబును పొగిడినప్పుడు.. మిమ్మల్ని తిట్టిన వాళ్లంతా ఓడిపోయారు’ అని చెప్పినట్లు సమాచారం. అనంతరం ఇరువురూ ఒకే ఫ్లైట్‌లో గన్నవరం ఎయిర్ పోర్ట్‌కి వచ్చారు.
Similar News
News September 16, 2025
మేడికొండూరు: భార్య చేయి నరికిన భర్త

మేడికొండూరు మండలం ఎలవర్తిపాడులో దారుణం జరిగింది. మద్యం మత్తులో దాసరి రాజు (45) తన భార్య రాణి (40) కుడిచేతిని కత్తిపీటతో నరికాడు. సోమవారం అర్ధరాత్రి భార్యపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అనంతరం నరికిన చేతిని సంచిలో వేసుకొని ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News September 16, 2025
అమరావతిలో ఆధునిక మురుగునీటి వ్యవస్థ

అమరావతిలో 934 కి.మీ పైపుల ద్వారా మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్మిస్తోంది. 13 STPలు రోజుకు మొత్తం 330.57 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటాయని CRDA పేర్కొంది. ఇవి ఫ్లషింగ్, శీతలీకరణ & నీటిపారుదల కోసం నీటిని తిరిగి ఉపయోగించుకునేలా చేస్తాయి! నగరాన్ని పచ్చగా, స్థిరంగా మార్చడానికి ఒక సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను కూడా ప్లాన్ చేస్తున్నారు.
News September 16, 2025
ANU: ఏపీ ఎడ్ సెట్-2025 షెడ్యూల్లో స్వల్ప మార్పు

ఏపీ ఎడ్‌సెట్-2025 కౌన్సెలింగ్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ స్వామి తెలిపారు. వెబ్ ఆప్షన్స్ గడువు ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించామన్నారు. కళాశాల మార్పునకు 18వ తేదీ చివరి గడువు అని పేర్కొన్నారు. అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ప్రక్రియ 20వ తేదీన జరుగుతుందని వెల్లడించారు. విద్యార్థులు ఈ మార్పులను గమనించాలని సూచించారు.