News September 10, 2024

రణస్థలం: వరద బాధితులకు రూ.80లక్షల చెక్కు అందజేత

image

విజయవాడ వరద బాధితుల కోసం మంగళవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఏపీ విలేజ్ సర్వేయర్లు అసోసియేషన్ తరుపున రూ.80లక్షల చెక్కును అందజేసినట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బూరాడ మధు తెలిపారు.శ్రీకాకుళం జిల్లా రణస్థలం గ్రామానికి చెందిన మధు యూనియన్ నాయకులు అయ్యప్పలనాయుడు, కిరణ్‌తో కలిసి విజయవాడలో పవన్ కళ్యాణ్‌కు చెక్కును అందించారు. రాష్ట్రంలోని సర్వేయర్లు అందరూ ఒకరోజు వేతనాన్ని అందించినట్లు తెలిపారు.

Similar News

News October 14, 2025

రైతుల ఖాతాల్లోకి 5,6 గంటల్లో దాన్యం కొనుగోలు డబ్బులు: మంత్రి మనోహర్

image

రైతులు వద్ద ధాన్యం కొనుగోలు చేసిన 5,6 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమవుతాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో వివిధ రైతు సంఘాలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో 48 గంటలు పట్టేదని అటువంటి ఇబ్బంది లేకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరళతరం చేస్తారన్నారు. దీనికి సంబంధించి సమస్యలను రైస్ మిల్లర్లకు అడిగి తెలుసుకున్నారు.

News October 14, 2025

SKLM: ‘దాన్యం సేకరణ ప్రణాళికతో జరగాలి’

image

రైతులకు ఎటువంటి ఇబ్బందిలేకుండా ముందస్తు ప్రణాళికతో ధాన్యం సేకరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. నేడు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల, డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మనోహర్, కమీషనర్, MD సూచనలు అనుసరించి రైతులు దగ్గర నుంచి దాన్యం కొనుగోలు చేయాలన్నారు.

News October 13, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

➧కల్తీ మద్యం వ్యవహారంపై జిల్లాలో పలు చోట్ల వైసీపీ నిరసన
➧ బాలీయాత్రపై సీఎం చంద్రబాబుకు వివరించాం: ఎమ్మెల్యే కూన
➧ కొత్తూరు: నీట మునిగిన పంటను పరిశీలించిన అధికారులు
➧వజ్రపుకొత్తూరు: విద్యాబుద్ధులు నేర్పిన బడిలోనే..టీచర్‌గా చేరింది
➧ ఎస్పీ గ్రీవెన్స్‌కు 50 వినతులు
➧శ్రీకాకుళం: 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
➧టెక్కలి: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళల గొడవ