News April 6, 2024
రణస్థలం: 48 మంది వాలంటీర్లు రాజీనామా
రణస్థలం మండలం జే.ఆర్.పురం 1, 2 గ్రామ సచివాలయాల పరిధిలోని 48 మంది గ్రామ వాలంటీర్లు ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు వ్యతిరేకంగా శనివారం స్వచ్చందంగా రాజీనామా చేశారు. ఈ సందర్బంగా వాలంటీర్లు మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి అమలు చేసి అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా వివరిస్తూ, రానున్న ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.
Similar News
News February 1, 2025
శ్రీకాకుళం: నిమ్మాడ హైవేపై కారు బోల్తా
కోటబొమ్మాళి మండలం నిమ్మాడ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. టెక్కలి నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న కారు ముందు టైరు పేలడంతో డివైడర్ని ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్పగాయాలు అయ్యాయి. స్థానికులు సహాయంతో కారుని రోడ్డు పక్కన ఉన్న సురక్షిత ప్రాంతానికి తరలించారు.
News January 31, 2025
శ్రీకాకుళంలో రథసప్తమి సంబరాలకు సర్వం సిద్ధం
అరసవల్లి రథసప్తమి వేడుకలకు చురుగ్గా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలు ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం సామూహిక సూర్య నమస్కారాలతో ప్రారంభమవుతాయని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని ఆదేశించారు.
News January 31, 2025
శ్రీకాకుళం: విద్యార్థినికి ఐసీయూలో చికిత్స
లైంగిక దాడిలో గాయపడ్డ శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినికి రిమ్స్ ICUలో చికిత్స కొనసాగుతోంది. కాగా విద్యార్థినికి ముఖం, మోచేయిపై తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థినికి ఆసుపత్రి వైద్యులు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థిని కాల్ డేటా, సీసీ ఫుటేజీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ విషయంపై మంత్రి అచ్చెన్నాయుడు, హోం మంత్రి అనిత ఆరా తీశారు.