News October 10, 2024
రతన్ టాటా మృతి ఎంతో బాధాకరం: మంత్రి టీజీ భరత్
టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మృతి పట్ల మంత్రి టీజీ భరత్ సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా మరణవార్త తనను ఎంతో దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. రతన్ టాటా ఆలోచనా విధానంతో టాటా గ్రూప్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని చెప్పారు. ఆయన ఎన్నో పరిశ్రమలు నెలకొల్పి లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని కొనియాడారు.
Similar News
News November 4, 2024
కర్నూలు కలెక్టరేట్‌లో నేడు డీఆర్సీ సమావేశం
కర్నూలు జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశాన్ని నేడు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరు కానున్నట్లు కలెక్టర్ కార్యాలయ అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆయన చర్చించనున్నారు.
News November 3, 2024
రేపు కలెక్టరేట్లో గ్రీవెన్స్ కార్యక్రమం
కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం నాడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మున్సిపల్, రెవెన్యూ, మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాలన్నారు.
News November 3, 2024
నంద్యాల: కారు ఢీకొని వ్యక్తి మృతి
గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామం సర్వీస్ రోడ్డు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. అయ్యలూరులోని ఓ మసీదులో ఇమామ్‌గా పని చేస్తున్న జిల్లెల్ల గ్రామానికి చెందిన ముల్లా మహమ్మద్ హుస్సేన్(38) మధ్యాహ్నం సిరివెళ్ల నుంచి స్కూటీపై అయ్యలూరు వస్తుండగా వెనుక వైపు నుంచి కారు ఢీకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.