News January 30, 2025

రథసప్తమికి నారా లోకేశ్‌కు ఆహ్వానం: గొండు శంకర్

image

దేశంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం మంగళగిరిలో ఆహ్వనించారు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేయడంతో శ్రీకాకుళం నగరం సర్వ సుందరంగా ముస్తాబవుతోంది.

Similar News

News February 15, 2025

శ్రీకాకుళం: ‘ట్రాఫిక్ నియమాలు పాటించండి’

image

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 7 రోడ్ల జంక్షన్ వరకు రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ జరిగింది. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం 1,2 డిపో మేనేజర్లు అమర సింహుడు, శర్మ పాల్గొన్నారు. అనంతరం ప్రయాణీకులతో పాటు ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ రూల్స్ ప్రతి బక్కరూ పాటించాలని, నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. 

News February 14, 2025

టెక్కలి: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

టెక్కలి ఆధి ఆంధ్రావీధి జాతీయ రహదారిపై ఉన్న ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత మంచినీటి పథకం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని ప్రాజెక్టు సిబ్బంది చూసి RWS అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 14, 2025

శ్రీకాకుళం: ‘రాజీయే రాజమార్గం’

image

మార్చి 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూనైద్ అహ్మద్ మౌలానా అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం కోర్టు భవన్‌లో శుక్రవారం న్యాయవాదులు, పోలీసులతో మాట్లాడారు. రాజీ మార్గం ద్వారా పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. ఈ అవకాశాన్ని ముద్దాయిలు వినియోగించుకోవాలని కోరారు.

error: Content is protected !!