News January 29, 2025

రథసప్తమి ఏర్పాట్లపై TTD అదనపు ఈవో సమీక్ష

image

తిరుమలలో ఫిబ్రవరి 4న జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమీక్ష  నిర్వహించారు. టీటీడీ వివిధ విభాగ అధికారులు, విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది పోలీసులతో సమన్వయం చేసుకుని ముందస్తుగా జన రద్దీని అంచనాలు వేసుకుని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్వో పాల్గొన్నారు.

Similar News

News December 1, 2025

వెన్నెముక కింద డింపుల్స్ ఎందుకుంటాయంటే?

image

వెన్నెముక దిగువ భాగంలో డింపుల్స్ ఎందుకు ఉంటాయో వైద్యులు వివరించారు. వీటిని మహిళల్లో ‘వీనస్ డింపుల్స్’, పురుషుల్లో ‘అపోలో డింపుల్స్’ అంటారు. ‘తుంటి ఎముక చర్మాన్ని లిగమెంట్ లాగడం వల్ల ఇవి ఏర్పడతాయి. ఇవి ఆడవారిలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇది సహజ శరీర నిర్మాణం మాత్రమే. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలుండవు. వెన్నెముక మధ్యలో ‘శాక్రల్ డింపుల్’ ఉంటే మాత్రం వైద్య పరీక్షలు చేయించుకోవాలి’ అని తెలిపారు.

News December 1, 2025

చిత్తూరు పీజీఆర్ఎస్‌కు 232 అర్జీలు

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 232 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. రెవెన్యూ సర్వే శాఖకు సంబంధించి 166, పోలీస్ శాఖ-7, పంచాయతీరాజ్-4, ఎండోమెంట్-1, డీపీవో-4, విద్యాశాఖ-2, వ్యవసాయ శాఖ-4, డీఆర్డీఏకి సంబంధించి 21 ఫిర్యాదులు అందాయని వారు తెలిపారు. వీటిని సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

News December 1, 2025

కాకినాడ జిల్లాలో 42 మంది స్క్రబ్ టైఫస్ వైరస్: DMHO

image

స్క్రబ్ టైఫస్ జ్వరాలతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా సుమారు 42 కేసులు పాజిటివ్ వచ్చినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరసింహ నాయక్ సోమవారం తెలిపారు. 232 మందికి పరీక్షలు నిర్వహించగా 42 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. నల్లి మాదిరిగా ఉండే స్క్రబ్ టైఫస్ అనే పురుగు కుట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.