News September 4, 2024
రద్దు చేసిన దూర ప్రాంత ఆర్టీసీ సర్వీసుల పునరుద్ధరణ
భారీ వర్షాల కారణంగా రద్దు చేసిన దూర ప్రాంతాల సర్వీసులన్నింటినీ ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు పునరుద్ధరించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడం, రోడ్ల మీద వరద ప్రవాహం తగ్గడంతో విజయవాడ, గుంటూరు జిల్లాలకు వెళ్లాల్సిన 14 బస్సులు, విజయవాడ, ఆపై ప్రాంతాల నుంచి విశాఖ రావలసిన ఆరు బస్సులను పునరుద్ధరించారు. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన బస్సును మాచర్ల మీదుగా నడుపుతున్నారు.
Similar News
News September 15, 2024
VZM: TODAY TOP NEWS..
⁍భోగాపురంలో ఆకట్టుకున్న కోలాటం
⁍గంజాయి నియంత్రణకు ఆర్టీసీ సహకరించాలి
⁍జామిలో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొన్న అధికారులు
⁍విజయనగరం: బంగారం షాపులో దొంగతనం
⁍పార్వతీపురంలో వందే భారత్ హాల్ట్‌కు అరకు ఎంపీ ప్రత్యేక చొరవ
⁍జలపాతం నుంచి మృతదేహాలను వెలికితీసిన APSDRF
⁍కొత్తవలసలో వివాహిత సూసైడ్
⁍విజయనగరం జిల్లాకు ఇద్దరు కొత్త డీఎస్పీలు
News September 15, 2024
పార్వతీపురంలో వందే భారత్ హాల్ట్‌కు అరకు ఎంపీ ప్రత్యేక చొరవ
పార్వతీపురంలో వందే భారత్ హాల్ట్ కోసం అరకు MP చెట్టి తనూజా రాణి ప్రత్యేక చొరవ చూపారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు రెండు రోజుల క్రితం మర్యదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో పార్వతీపురంలో వందే భారత్‌కు హాల్ట్ కల్పించాలని కోరుతూ వినితిపత్రం అందజేశారు. ఆమె ప్రతిపాదనల మేరకు రైల్వే మంత్రి DRM కార్యాలయానికి ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా పార్వతీపురం ప్రజలు అరకు MPకి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
News September 15, 2024
వందే భారత్ ట్రైన్‌కు పార్వతీపురంలో హాల్ట్
నేటినుంచి ప్రారంభమయ్యే దుర్గ్-విశాఖపట్నం-దుర్గ్ వందే భారత్ రైలుకు పార్వతీపురంలో హాల్ట్ కల్పించారు. ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి జిల్లాలో విజయనగరం ఒకటే హాల్ట్ ఇచ్చారు. దీంతో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర విశాఖపట్నం డీఆర్ఎం సౌరవ్ ప్రసాద్, కేంద్ర రైల్వే సహాయ మంత్రికి వినతిపత్రం అందజేశారు. దీంతో జిల్లా కేంద్రమైన పార్వతీపురంలో కూడా హాల్ట్ కల్పించారు.