News February 21, 2025
రబీ పంటకు అవసరమైన నీటి సరఫరా కోసం తగిన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

రబీ పంటకు అవసరమైన నీటి సరఫరా కోసం తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల అధికారులతో రబీలో సాగునీటి సౌకర్యంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రబీ పంటకు అవసరమైన నీటి సరఫరా కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News February 25, 2026
KMR: నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు

కామారెడ్డి జిల్లాలో నేటి నుంచి మార్చి 17 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 37 కేంద్రాల్లో 17,953 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ప్రథమ సంవత్సరంలో 9,013 మంది, ద్వితీయ సంవత్సరంలో 8,940 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 37 మంది చీఫ్ సూపరింటెండెంట్ల పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.
News February 25, 2026
సిద్దిపేట: 4వ అంతస్తు నుంచి పడి మృతి

సికింద్రాబాద్ వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న భవనం నాలుగో అంతస్తు నుంచి జారిపడి బశెట్టి రాజు (41) అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గోవా కట్టెలు తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగింది. మృతుడు సిద్దిపేట వాసిగా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శశాంక్ రెడ్డి తెలిపారు.
News February 25, 2026
ఆనందంగా జీవించాలంటే ఇవి చాలు

జీవితంలో అశాంతికి కారణం పోలికే అంటున్నారు మానసిక నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే మీకేం కావాలో ముందు తెలుసుకోవాలి. అసలైన సంపద ఆరోగ్యం, అవసరాలు తీర్చేంత బ్యాంక్ బ్యాలెన్స్, అర్థం చేసుకొనే భాగస్వామి, గాలి కబుర్లు, చెప్పుడు మాటలు చెప్పేవారిని దూరం పెట్టండి, రోజూ ఆత్మపరిశీలన చేసుకుంటే సరిపోతుంది. ప్రతికూల ఆలోచనలు చేయకండి. ఇతరులతో పోల్చుకోవడం మానేయండి.


