News April 9, 2025
రమను కోల్పోవడం జిల్లాకు తీరని లోటు: కలెక్టర్

విధుల పట్ల ఎంతో నిబద్ధత కలిగిన రమ ను కోల్పోవడం జిల్లాకు తీరని లోటని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. రాయచోటి కలెక్టరేట్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్. రమ మరణం పట్ల సంతాప సభను నిర్వహించారు. రమ ఎంతో నిబద్ధతగా విధులు నిర్వహించే వారన్నారు. అటువంటి మంచి డిప్యూటీ కలెక్టర్‌ను పోగొట్టుకోవడం జిల్లాకు తీరని లోటని పేర్కొన్నారు.
Similar News
News February 24, 2026
కామారెడ్డి జిల్లాలో వర్షపాతం ఎలా ఉందంటే!

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. ఇసాయిపేట్ 17.8మి.మీ, తాడ్వాయి 13, ఆర్గొండ 12, రామలక్ష్మణపల్లి 11.3, లచ్చపేట 9.3, పాత రాజంపేట 7.8, దోమకొండ 7.3, భిక్కనూరు 5, జుక్కల్ 4.8, రామారెడ్డి 2.3 మి.మీ ల అత్యధిక వర్షపాతం నమోదయ్యాయి. జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత భిక్కనూరు 21.8°C, కాగా అత్యల్ప ఉష్ణోగ్రత మేనూరు 17.4°C లో రికార్డు అయ్యాయి.
News February 24, 2026
KNR: డిజిటల్ జూదం.. పోలీసులకు సవాల్!

కరీంనగర్ జిల్లాలో పేకాటరాయుళ్లు పంథా మార్చారు. పోలీసులకు చిక్కకుండా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా నగదు బదిలీ చేస్తూ జూదం ఆడుతున్నారు. శివారు ప్రాంతాల్లోని తోటలు, కోళ్ల ఫారాలను అడ్డాలుగా మార్చుకొని.. బయట కాపలాదారులు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. గత మూడేళ్లలో 1,433 మందిని పోలీసులు పట్టుకున్నా.. తాజా సాంకేతిక పోకడలు, పక్కా నిఘా వ్యవస్థ వారికి సవాలుగా మారాయి.
News February 24, 2026
బాపట్ల: కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల

బాపట్ల జిల్లాలో మిగిలిపోయిన 5 బార్ల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. బాపట్ల మున్సిపాలిటీలో 2, రేపల్లెలో 3 బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి నరేశ్ కుమార్ తెలిపారు. ఆసక్తిగలవారు రూ.5 లక్షల అప్లికేషన్ ఫీజు, రూ.10 వేల ప్రాసెసింగ్ ఫీజుతో మార్చి 2వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు ఆన్లైన్ లేదా నేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.


