News June 29, 2024
రమేష్ రాథోడ్ మృతిపై ఏపీ సీఎం సంతాపం

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతిపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో రమేష్ రాథోడ్ టిడిపి నుండి ఖానాపూర్ ఎమ్మెల్యేగా, ఆదిలాబాద్ ఎంపీగా, జడ్పీ ఛైర్మన్గా పని చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆదివాసి, గిరిజన గ్రామాల అభివృద్ధికి ఆయన కృషి చేశారని, రమేష్ రాథోడ్ మృతి తనను ఎంతో బాధించిందని ఆయన వెల్లడించారు.
Similar News
News November 1, 2025
భీంపూర్లో పులి సంచారం

భీంపూర్ మండలంలో పులి సంచారం రైతులకు కునుకు లేకుండా చేస్తుంది. శనివారం ఉదయం పిప్పల్ కోటి, గూడ గ్రామాల శివారులోని యాల్ల కేశవ్, పొగుల రమేశ్ పంట పొలాల్లో పులి కనిపించింది. గమనించిన కూలీలు భయంతో ఇంటికి వెళ్లిపోయినట్లు గ్రామస్థలుు తెలిపారు. కాగా ప్రస్తుతం పులి గర్భం దాల్చినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు.
News November 1, 2025
ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన విద్య అందించాలి

ప్రభుత్వ విద్యా సంస్థల్లో పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణి ఆదేశించారు. శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ రాజార్షి షా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, విద్యాశాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన బోధన, మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు.
News November 1, 2025
ఆదిలాబాద్: నూతన డీఈఓగా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావు

ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ను నియమిస్తూ కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వలు జారీ చేశారు. ప్రస్తుత డీఈవోగా పని చేస్తున్న ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా పర్సనల్ సెలవుల్లో వెళ్లునున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావుకు నవంబర్ 4 నుంచి ఇన్ఛార్జి డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.


