News December 7, 2024
రవాణా శాఖ తనిఖీల్లో 832 కేసులు నమోదు

ఏలూరు జిల్లాలో కొనసాగుతున్న రవాణా శాఖ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా 832 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ తెలిపారు. డిసెంబరు ఒకటవ తేదీ నుంచి ఈరోజు వరకు వివిధ రకాల వాహనాలపై పలు ఉల్లంఘనలకు గాను 832 కేసులు నమోదు చేసి 14 లక్షల 92 వేల రూపాయల అపరాధ రుసుము విధించామన్నారు. విద్యా సంస్థల బస్సులపై 23 కేసులు నమోదు చేశామన్నారు.
Similar News
News October 25, 2025
రేపటి నుంచి 3 రోజులు బీచ్‌కి రావొద్దు: ఎస్సై

తుపాన్ హెచ్చరికల జారీ, సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగిన కారణంగా ఈ నెల 26 నుంచి 28 వరకు పేరుపాలెం బీచ్‌లోకి సందర్శకులకు అనుమతి లేదని మొగల్తూరు ఎస్సై వాసు శనివారం తెలిపారు. వాతావరణంలోని మార్పుల వల్ల అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నారు. సందర్శకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
News October 25, 2025
సురక్షా యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్ వద్ద కలెక్టర్ చదలవాడ నాగరాణి సురక్షా యాప్ వినియోగం, ప్లాస్టిక్ నిషేధం, గంజాయి, మత్తు పదార్థాల తనిఖీలు, ఎక్సైజ్ శాఖ ప్రగతి తదితర అంశాలపై ఎక్సైజ్ అధికారులతో సమీక్షించారు. కల్తీ అక్రమ మద్యాన్ని పూర్తిగా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు సురక్షా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. వినియోగదారులు ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News October 25, 2025
ఆక్వా సాగు చెరువులు తప్పనిసరిగా CAA కింద రిజిస్టర్ కావాలి: కలెక్టర్

ఉప్పునీటి ఆక్వా సాగు చెరువులు తప్పనిసరిగా కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (CAA) కింద రిజిస్టర్ కావాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. రిజిస్టర్ కాని చెరువులకు చట్టబద్ధత ఉండదని, సీఏఏ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఆక్వా సాగు నిర్వహించాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


