News January 27, 2025
రవీంద్రభారతిలో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

నాట్యగురువులు మంజుల రామస్వామి, వీఎస్ రామమూర్తి శిష్యురాలు జీఎస్ విద్యానందిని భరతనాట్య ఆరంగేట్రం ఆదివారం రవీంద్రభారతిలో కనుల పండువగా జరిగింది. పుష్పాంజలి, గణపతి స్తుతి, జతిస్వరం, థిల్లాన వంటి పలు అంశాలపై చక్కటి హావభావాలతో సాగిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సరస్వతి ఉపాసకులు దైవాజ్ఞశర్మ, ప్రముఖ కవి రాధశ్రీ, సాంస్కృతిక పండితులు సాధన నర్సింహాచారి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Similar News
News November 20, 2025
HYD: BRS ఆఫీస్ మూత.. ఫాంహౌస్ వద్దే మీ నేత: కాంగ్రెస్

BRS, KCR, KTR టార్గెట్గా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘జూబ్లీహిల్స్లో ఓటమే మీ శాశ్వత పతనానికి నాంది KTR.. GHMCపై మీరు ఆశలు పెట్టుకోవడం అంటే ఎండమావిలో నీళ్లు తాగినట్టే.. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికే దూరంకొట్టిన్రు.. మరికొద్దిరోజుల్లోనే మీ పార్టీ ఆఫీస్ మూత.. ఫాంహౌస్ వద్దే మీ నేత’ అని పేర్కొంది. కాగా GHMC ఎన్నికల్లోనూ BRSను చిత్తుగా ఓడిస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
News November 20, 2025
గ్రామాల దేవాలయాలకు సోలార్ భద్రత: చిలుకూరు అర్చకుడు

సీఎస్ఆర్ ద్వారా దేశవ్యాప్తంగా బ్యాంకులు, దేవాలయాల భాగస్వామ్యానికి కొత్త దారిని చూపుతూ చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్ ముందడుగు వేశారు. మొయినాబాద్ మండలంలోని పలు గ్రామాల్లోని దేవాలయాల్లో 60 సోలార్ ఆధారిత సీసీ కెమెరాలను అందించారు. వీటిని ఎస్బీఐ, యూబీఐ సంయుక్తంగా అందజేశారు. ఇలాంటి రిమోట్ సర్వైలెన్స్ సొల్యూషన్లను సీఎస్ఆర్కు అనుసంధానించడం దేశంలో ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొ న్నారు.
News November 20, 2025
HYD: బాధితులకు అండగా సైబర్ పోలీసులు

డబ్బు పోగొట్టుకున్న బాధితులకు సైబర్ క్రైం పోలీసులు అండగా నిలిచారు. ఫిర్యాదు స్వీకరించిన మరుక్షణం నుంచే స్పందించి సైబర్ నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వారి నుంచి రూ.63.23 లక్షలు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు 18 మంది నిందితులను వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు డీసీపీ సాయిశ్రీ తెలిపారు.


