News January 27, 2025

రవీంద్రభారతిలో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

image

నాట్యగురువులు మంజుల రామస్వామి, వీఎస్‌ రామమూర్తి శిష్యురాలు జీఎస్‌ విద్యానందిని భరతనాట్య ఆరంగేట్రం ఆదివారం రవీంద్రభారతిలో కనుల పండువగా జరిగింది. పుష్పాంజలి, గణపతి స్తుతి, జతిస్వరం, థిల్లాన వంటి పలు అంశాలపై చక్కటి హావభావాలతో సాగిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సరస్వతి ఉపాసకులు దైవాజ్ఞశర్మ, ప్రముఖ కవి రాధశ్రీ, సాంస్కృతిక పండితులు సాధన నర్సింహాచారి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Similar News

News February 9, 2025

అత్యాశ.. ఉన్నదీ పోయింది!

image

కేంద్రంలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించాలన్న అత్యాశే ఆప్ కొంప ముంచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 3 సార్లు ఢిల్లీ ప్రజలు అధికారం ఇవ్వడం, ఆ తర్వాత పంజాబ్‌లోనూ పాగా వేయడంతో చక్రం తిప్పాలని కేజ్రీవాల్ భావించారు. ‘ఇండియా’ కూటమి నుంచి దూరమై నేరుగా మోదీపైనే విమర్శలు చేస్తూ దేశప్రజల దృష్టిని ఆకర్షించాలని చూశారు. ఈక్రమంలోనే అవినీతి ఆరోపణల కేసులు, ఢిల్లీలో పాలన గాడి తప్పడంతో ప్రజలు ఓటుతో ఊడ్చేశారు.

News February 9, 2025

నల్గొండ కబడ్డీ ట్రోఫీ గెలుచుకున్న ఓల్డ్ సిటీ టీం

image

నల్గొండ జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ఓల్డ్ సిటీ జట్టు మొదటి బహుమతి గెలుచుకుంది. ముఖ్య అతిథిగా DSP శివరాం రెడ్డి హాజరై బహుమతులు ప్రదానం చేశారు. క్రీడలతో స్నేహభావం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.

News February 9, 2025

శ్రీకాకుళం: తాను చనిపోతూ చూపునిచ్చాడు

image

శ్రీకాకుళం పట్టణం బ్యాంకర్స్ కాలనీలో నివాసం ఉంటున్న బురిడి ముఖలింగం (75) శనివారం మృతి చెందారు. అతని నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ జగన్మోహన్ రావుకు తెలిపారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రానికి చెందిన ఐ టెక్నీషియన్ సుజాత, జగదీశ్, పవన్ అతని కార్నియాలు సేకరించారు. విశాఖపట్నం ఎల్.వి నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.

error: Content is protected !!