News February 20, 2025
రవీంద్ర భారతిలో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు

రవీంద్ర భారతిలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బంజారా ధార్మిక వ్యాప్తి మహాసంఘ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగ్ బండారి హోమంలో పాల్గొన్నారు. గిరిజన జాతిని చైతన్య పరిచేందుకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, పూజనీయుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286 జయంత్యుత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News November 22, 2025
HYDలో అతి పెద్ద పౌల్ట్రీ ఎక్స్పో

దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఈవెంట్ ‘పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్-2025’కు భాగ్యనగరం ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 25 నుంచి హైటెక్స్‌లో ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (IPEMA) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ అంతర్జాతీయ ఎక్స్పో జరగనుంది. సుమారు 50 దేశాల నుంచి 500కు పైగా ఎగ్జిబిటర్లు, 40వేల మంది సందర్శకులు హాజరుకానున్నారు. సస్టెయినబుల్ ఫీడ్, ఆటోమేషన్ వంటి అంశాలపై చర్చిస్తారు.
News November 22, 2025
HYD: పైలట్‌పై అత్యాచారయత్నం

అత్యాచారయత్నం చేసినట్లు బాధితురాలు HYDలోని బేగంపేట PSలో ఫిర్యాదు చేసింది. ఓ ఏవియేషన్ సంస్థకు చెందిన కమర్షియల్ పైలట్ రోహిత్ శరణ్ (60) సహోద్యోగి అయిన యువతిపై బెంగళూరులో అత్యాచారయత్నం చేశాడు. సంస్థ పని నిమిత్తం బెంగళూరు వెళ్లిన సమయంలో హోటల్ గదిలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు, సంఘటన బెంగళూరు హలసూరు పోలీస్ స్టేషన్ పరిధి కావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు.
News November 22, 2025
HYD: పెళ్లి కావట్లేదని అమ్మాయి చనిపోయింది..!

ఓ యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సిద్దిపేట(D) మద్దూర్(M) రేబర్తి వాసి కుంటి నిరోష(32) సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తోంది. చింతల్ పద్మానగర్‌లో తన సోదరుడు నరేశ్‌తో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఆమెకు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు పెళ్లి కావట్లేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. కేసు నమోదైంది.


