News February 25, 2026
రష్యన్ అమ్మాయిలతో అఫైర్ నిజమే.. కానీ: బిల్‌గేట్స్

‘ఎప్‌స్టీన్ ఫైల్స్’లో తన పేరు రావడంపై గేట్స్ ఫౌండేషన్ సిబ్బందికి బిల్ గేట్స్ క్షమాపణలు చెప్పారు. లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్‌ను కలిసి తాను పెద్ద తప్పు చేశానని.. దాని వల్ల ఇబ్బంది పడ్డ వారికి క్షమాపణలు చెబుతున్నానన్నారు. రష్యన్ అమ్మాయిలతో అఫైర్ ఉందని.. ఈ విషయాన్ని ఎప్‌స్టీన్ తెలుసుకున్న మాట నిజమేనని అంగీకరించారు. కానీ ఎప్‌స్టీన్ బాధితులతో సంబంధం లేదని.. తాను చట్టవిరుద్ధమైన పనులు చేయలేదన్నారు.
Similar News
News April 16, 2026
కృష్ణా: ప్రారంభమైన జనగణన.. స్వీయ గణన చేసుకున్న కలెక్టర్

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 2027 జనగణన కార్యక్రమం గురువారం కృష్ణా జిల్లాలో ప్రారంభమైంది. ఈ విడత ప్రజలే స్వీయ గణన చేసుకునే అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో మచిలీపట్నంలో కలెక్టర్ డీకే బాలాజీ తన కుటుంబ వివరాలను జనగణన ఆన్ లైన్ పోర్టల్ https://se.space.gov.in ద్వారా నమోదు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
News April 16, 2026
తమిళనాడులో TVK విజయ్ మ్యానిఫెస్టో.. పెళ్లికి 8 గ్రా. బంగారం

*60 ఏళ్ల కంటే తక్కువ వయసున్న మహిళలకు నెలకు రూ.2,500
*ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు
*పేదవారి పెళ్లికి 8 గ్రాముల బంగారం, పట్టు చీర
*ప్రతి ఇంటికి సురక్షిత మంచి నీరు
*పిల్లలను ప్రభుత్వ స్కూళ్లల్లో చదివిస్తే ఏడాదికి రూ.15వేలు
*ఉన్నత విద్యకు రూ.20 లక్షల వరకు లోన్లు
*రాష్ట్రవ్యాప్తంగా 100 రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు
*రైతుల పంట రుణాలు మాఫీ
News April 16, 2026
భగ్గుమన్న భానుడు.. సీజన్లో తొలిసారి..

తెలంగాణలో భానుడు నిప్పులు చిమ్ముతున్నాడు. ఈ సీజన్లో తొలిసారి ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. ఇవాళ అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 44.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో 44.3, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 2-3 రోజులు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.


