News August 21, 2024

రష్యాలో ఎల్బ్రస్ పర్వతం అధిరోహించిన తెలుగు యువతి

image

రష్యాలోని ఎల్బ్రస్ పర్వతాన్ని తెలుగు యువతి అధిరోహించింది. ఈ పర్వతం రష్యా, ఐరోపాలో ఎత్తైన పర్వతం. ఇది సముద్ర మట్టానికి 5,642మీ(18,510 అడుగులు) ఎత్తులో ఉన్న ఒక నిద్రాణమైన అగ్నిపర్వతం. ఇది యురేషియా సూపర్ ఖండంలో ఎత్తైన స్ట్రాటోవోల్కానో, అలాగే ప్రపంచంలోని 10వ-అత్యంత ప్రముఖ శిఖరం. ఈ శిఖరాన్ని తాడేపల్లికి చెందిన యువతి అన్నపూర్ణ అలవోకగా అధిరోహించారు. ఆమె త్వరలో తాడేపల్లికి రానున్నారు. 

Similar News

News September 21, 2024

రేపు జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు

image

గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జూనియర్ బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా కార్యదర్శి శివ శంకర్ తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటలకు స్థానిక ఎన్జిఓ క్లబ్‌లో పోటీలు ఉంటాయన్నారు. ఎంపిక చేసిన జట్లను విశాఖపట్నం జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని చెప్పారు.

News September 21, 2024

లడ్డూపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: ఎమ్మెల్యే యరపతినేని

image

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల కల్తీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శుక్రవారం మాచవరం మండలం పిన్నెల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రభుత్వం జంతువుల నూనెతో లడ్డూ తయారు చేశారని, దీనికి కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

News September 20, 2024

మధ్యాహ్న భోజన పథకానికి బియ్యం వితరణ

image

కాకుమాను మండల టీడీపీ నేతలు ఆధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి 14 టన్నుల బియ్యం అందించినట్లు కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. శుక్రవారం పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సమక్షంలో బియ్యంలోడును కలెక్టర్‌కు అందజేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి ఇప్పటికే పలుసార్లు సరుకులు అందించామని.. ప్రస్తుతం బియ్యం అందించినట్లు వారు తెలిపారు.