News March 24, 2025
రసవత్తరంగా చిలకలూరిపేట రాజకీయం.. మీ కామెంట్

రాజకీయ చైతన్యం గల చిలకలూరిపేటలో పాలిటిక్స్ వేడెక్కాయి. నియోజకవర్గంలో బలమైన నేతయిన మర్రి రాజశేఖర్ TDPలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు TDPలో చక్రం తిప్పిన సీనియర్ లీడర్, MLA పత్తిపాటి పుల్లారావు స్పందనెలా ఉంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇటు ప్రతిపక్షం నుంచి విడదల రజినీ బలంగా YCP గొంతు వినిపిస్తున్నారు. దీంతో ప్రత్తిపాటి, మర్రి వర్సెస్ రజినీగా రాజకీయం రసవత్తరంగా మారింది.
Similar News
News December 6, 2025
దాతలు సమాజానికి నిజమైన స్ఫూర్తిప్రదాతలు: కలెక్టర్

విదేశాల్లో స్థిరపడి మాతృభూమిపై మమకారంతో ప్రజాసేవకు ముందుకొస్తున్న దాతలు నిజమైన స్ఫూర్తిప్రదాతలు అని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. శనివారం జీజీహెచ్‌లో ఆల్ ఫ్రెస్కో యాంపీ థియేటర్ ఆమె ప్రారంభించారు. సమాజ అభివృద్ధిలో దాతలను భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం పీ4 కార్యక్రమాన్ని సైతం అమలు చేస్తుందని తెలిపారు. జీజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.
News December 6, 2025
GNT: వైసీపీ బీసీ సెల్ ఉపాధ్యక్షుడిగా సిరిబోయిన

వైసీపీ బీసీ సెల్ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా సిరిబోయిన అవినాశ్ నియమితులయ్యారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం అదిష్ఠానం తనను ఉపాధ్యక్షుడిగా నియమించడం సంతోషంగా ఉందని అన్నారు. రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు నూరీఫాతీమా తనకు పదవి రావడానికి కృషి చేశారని హర్షం వ్యక్తం చేశారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.
News December 6, 2025
GNT: మంత్రి నారా లోకేశ్‌పై అంబటి ట్వీట్

మంత్రి నారా లోకేశ్‌పై గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ‘X’లో సెటైరికల్ ట్వీట్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం మంత్రి లోకేశ్ చంద్రబాబు ప్లేటును తీస్తున్న ఓ ఫొటో షేర్ చేసి, ఇప్పుడు నువ్వు “తిన్న ప్లేటు” రేపు నువ్వు “కూర్చున్న సీటు” తీసేయడం కాయం.! అంటూ క్యాప్షన్ ఇచ్చి చంద్రబాబు, లోకేశ్‌లకు ట్యాగ్ చేశారు.


