News March 22, 2024
రసవత్తరంగా మహబూబ్నగర్ MLC ఉపఎన్నిక

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ముందుకెళ్తుంది. దీంతో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను కాపాడుకునేందుకు నేతలు క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఇప్పటికే వివిధ మండలాల నుంచి ఓటర్లను క్యాంప్కు తీసుకెళ్లగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ ఓటర్లకు గాలం వేసే పనిలో ఉన్నారని సమాచారం.
Similar News
News December 15, 2025
MBNR: PHASE-3 ఎన్నికలకు భారీ బందోబస్తు: ఎస్పీ

మహబూబ్నగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు అడ్డాకుల, బాలానగర్, జడ్చర్ల, మూసాపేట, భూత్పూర్ మండలాల్లో ఈనెల 17న ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 01:00 గంటల వరకు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డి. జానకి తెలిపారు.
News December 15, 2025
పాలమూరు: మూడో విడత పోలింగ్.. పటిష్ట బందోబస్తు: SP

పాలమూరు జిల్లాలో ఈనెల 17న జరగనున్న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకి తెలిపారు. బాలానగర్, మూసాపేట, అడ్డాకుల, జడ్చర్ల, భూత్పూర్ మండలాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె వెల్లడించారు.
News December 15, 2025
మహబూబ్ నగర్ జిల్లా నేటి ముఖ్యంశాలు

@మహబూబ్ నగర్ జిల్లాల్లో రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
@మిడ్జిల్ మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ. డి.జానకి ఎన్నికల పోలింగ్ను పరిశీలించారు.
@కౌకుంట్ల మండలంలో 12 గ్రామపంచాయతీలకు గాను.. 10 గ్రామపంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.
@దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి స్వగ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి పావని 110 ఓట్లతో గెలుపొందింది.
@ మిడ్జిల్లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.


