News November 12, 2024
రహదారి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ రాజకుమారి

నంద్యాల: పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలలో శంకుస్థాపన చేసిన రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో కలెక్టరేట్‌లో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు రూ.86 కోట్లతో జిల్లాలో 1023 సీసీ రోడ్లు, 3 బీటీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News April 10, 2026
చెత్త నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగించండి: కలెక్టర్

కర్నూలు నగర శివారులోని గార్గేయపురం డంపింగ్ యార్డ్‌ను కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సందర్శించారు. నగర కమిషనర్ విశ్వనాథ్, ఆర్డీవోతో కలిసి చెత్తను శాస్త్రీయ విధానంలో డీకంపోజ్ చేసే ప్రక్రియను పరిశీలించారు. యార్డ్‌లో అమలవుతున్న నిర్వహణ పద్ధతులను అధికారులతో సమీక్షించారు. మరింత మెరుగైన చర్యలు చేపట్టాలని సూచించారు. చెత్త నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నగరాన్ని శుభ్రంగా ఉంచాలన్నారు.
News April 9, 2026
పోషణ పక్వాడ కార్యక్రమాలు నిర్వహించాలి: కలెక్టర్ సిరి

కర్నూలు జిల్లాలో ఈనెల 9 నుంచి 23 వరకు జరగనున్న పోషణ పక్వాడ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఏ.సిరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పోషణ పక్వాడ పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. 2 ఏళ్లలోపు పిల్లలకు మొబైల్, టీవీ స్క్రీన్‌లను పూర్తిగా దూరం పెట్టాలని సూచించారు. జంక్ ఫుడ్స్‌కు బదులుగా పప్పులు, పల్లీలు, పండ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించాలని చెప్పారు.
News April 9, 2026
పాత వాహనాల కొనుగోలులో జాగ్రత్తలు: ఎస్పీ

పాత వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. తక్కువ ధరకు వస్తున్నాయని రిజిస్ట్రేషన్ పత్రాలు లేని వాహనాలు కొనవద్దని హెచ్చరించారు. వాహనం కొనుగోలు ముందు ఆర్సీ, ఇన్సూరెన్స్, పీయూసీ వివరాలు RTA వెబ్‌సైట్‌లో చెక్ చేయాలని సూచించారు. చాసిస్, ఇంజిన్ నంబర్లు ఆర్సీతో సరిపోల్చాలన్నారు. విక్రేత అసలు యజమానా, కాదో నిర్ధారించుకోవాలన్నారు.


