News February 15, 2025
రహదారి భద్రత నిరంతర ప్రక్రియ: కలెక్టర్

రహదారి భద్రత నిరంతర ప్రక్రియ అని, వాహనదారులందరూ నిత్యం రహదారి నియమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. శనివారం అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్లో 36వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల 2025 ముగింపు సమావేశాన్ని ఆయన ఆటో డ్రైవర్లు, వివిధ కళాశాలల విద్యార్థులతో నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం వలన ప్రమాదాలను నివారించవచ్చన్నారు.
Similar News
News November 26, 2025
డైరెక్టర్ సంపత్ నంది తండ్రి కన్నుమూత

టాలీవుడ్ డైరెక్టర్ సంపత్ నంది ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి కిష్టయ్య(73) అనారోగ్యంతో నిన్న రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సంపత్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు చేశారు. ‘చిన్నప్పుడు జబ్బు చేస్తే నన్ను భుజంపై 10KM మోసుకెళ్లింది మొన్నే కాదా అనిపిస్తోంది. నీకు నలుగురు పిల్లలున్నారు. వాళ్లకీ బిడ్డలున్నారు. ఏ కడుపునైనా ఎంచుకో. ఏ గడపనైనా పంచుకో. కానీ మళ్లీ రా’ అని రాసుకొచ్చారు.
News November 26, 2025
ఆస్పత్రి నుంచి స్మృతి తండ్రి డిశ్చార్జ్.. పెళ్లిపై ప్రకటన ఉంటుందా?

మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు యాంజియోగ్రఫీ సహా అన్ని టెస్టులు పూర్తయ్యాయని, ఎక్కడా బ్లాక్స్ లేవని వైద్యులు తెలిపారు. మరోవైపు స్మృతి పెళ్లిపై వెలువడుతున్న ఊహాగానాలకు కుటుంబం సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. పలాశ్ ముచ్చల్ వేరే యువతితో చేసిన చాటింగ్ బయటకు రావడంతో పెళ్లి రద్దు చేసుకున్నట్లు వార్తలు వస్తున్న విషయం <<18385575>>తెలిసిందే.<<>>
News November 26, 2025
పదవ తరగతి పరీక్ష ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు: డీఈవో

పదవ తరగతి పరీక్ష ఫీజును ఆన్లైన్ సేవా కేంద్రాల ద్వారా చెల్లించవచ్చని పల్నాడు డీఈవో చంద్రకళ తెలిపారు. డిసెంబర్ 1 నుంచి పదవ తేదీ వరకు ఫైన్ లేకుండా చెల్లించవచ్చన్నారు. ఆ తర్వాత 15వ తేదీ వరకు ఫైన్తో చెల్లించవచ్చన్నారు. ఎస్ ఎస్ సి వెబ్సైట్, నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డ్, ఆన్లైన్ పేమెంట్ గేట్ వే ద్వారా కూడా పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లించవచ్చని డీఈవో తెలియజేశారు.


