News February 15, 2025
రహదారి భద్రత నిరంతర ప్రక్రియ: కలెక్టర్

రహదారి భద్రత నిరంతర ప్రక్రియ అని, వాహనదారులందరూ నిత్యం రహదారి నియమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. శనివారం అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్‌లో 36వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల 2025 ముగింపు సమావేశాన్ని ఆయన ఆటో డ్రైవర్లు, వివిధ కళాశాలల విద్యార్థులతో నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం వలన ప్రమాదాలను నివారించవచ్చన్నారు.
Similar News
News March 25, 2025
ఒక్క రోజులో.. 3,03,100 ఫాలోవర్స్!

మొన్నటి వరకూ ముంబై బౌలర్ విఘ్నేశ్ పుతుర్ గురించి చాలా మందికి తెలియదు. కానీ, ఒక్క మ్యాచుతో ఆయన ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఆయనకు రెండు రోజుల క్రితం 24.9వేల మంది ఫాలోవర్లుంటే, నేడు వారి సంఖ్య 3,28,000కి చేరింది. ఆటో డ్రైవర్ కొడుకు గ్రౌండ్‌లో ఆటగాళ్లను షేక్ చేశారని కొనియాడుతున్నారు. జట్టులో ఉన్న సచిన్ కుమారుడు అర్జున్ విఘ్నేశ్‌ను చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు.
News March 25, 2025
గ్రామ పంచాయతీలు లేని జిల్లాగా మన మేడ్చల్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇక గ్రామాలు లేని జిల్లాగా మారనుంది. గతంలో 4 కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు, 61 గ్రామ పంచాయతీలు ఉండేవి. అవన్నీ గ్రామాలు మేడ్చల్ నియోజకవర్గంలోనే అన్ని గ్రామాలు ఉండేవి. కొన్ని నెలల క్రితం 28 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన గ్రామాలతో 3 కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడంతో గ్రామాలు లేకుండా పోయాయి. మున్సిపాలిటీల సంఖ్య 12కు చేరింది.
News March 25, 2025
కొమురవెల్లి: పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించిన సీపీ

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పది ఆదివారాల పాటు బందోబస్తు నిర్వహించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని సోమవారం పోలీస్ కమిషనర్ అనురాధ అభినందించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. జిల్లాలో జరిగే అతి పెద్ద జాతర మల్లన్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించిన సిబ్బందిని అభినందించారు.