News February 19, 2025
రహమత్‌నగర్ ఆస్పత్రిలో కలెక్టర్ అనుదీప్

రహ్మత్‌నగర్ డివిజన్ శ్రీ రామ్ నగర్‌లోని గవర్నమెంట్ ఆస్పత్రిని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి పరిశీలించారు. సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. గైనకాలజిస్ట్ డాక్టర్ లేకపోవడం, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన దృష్టికి కార్పొరేటర్ సీఎన్ రెడ్డి తీసుకెళ్లారు. ఎస్పీఆర్ హిల్స్‌లోని క్వారీ ల్యాండ్, వాటర్ రిజర్వాయర్, స్టడీ సర్కిల్‌ని కూడా కలెక్టర్ సందర్శించారు.
Similar News
News November 23, 2025
HYD: సమయం లేదు మిత్రమా.. పనులు చకచకా

మరో రెండువారాల్లో (డిసెంబర్ 8,9) ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానున్నసంగతి తెలిసిందే. దీంతో అధికారులు మీర్ఖాన్పేట వద్ద పనులు చకచకా చేయిస్తున్నారు. దాదాపు 120 ఎకరాలను చదును చేయిస్తున్నారు. పనులపై ఏరోజుకారోజు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అప్డేట్ ఇస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో పనుల్లో ఆలస్యం జరగరాదని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో నిరంతరం పనులు చేయిస్తున్నారు.
News November 23, 2025
HYD: వీకెండ్ డ్రంక్& డ్రైవ్‌లో 468 మంది దొరికారు

సైబరాబాద్‌లో వీకెండ్ డ్రంక్& డ్రైవ్‌లో 468 మంది పట్టుబడ్డారు. వాహనాల వారీగా 335 టూవీలర్లు, 25 ఆటోలు, 107 కార్లు, 1 హెవీ వెహికల్ సీజ్ చేశారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే ప్రమాదం జరిగితే BNS సెక్షన్ 105 కింద 10 ఏళ్ల జైలు శిక్ష వర్తిస్తుందని పోలీసులు హెచ్చరించారు. గత వారం 681 కేసులు డిస్పోజ్ కాగా.. 613 మందికి ఫైన్, 50 మందికి ఫైన్+ సర్వీస్, 18 మందికి ఫైన్+ జైలు శిక్ష విధించారు.
News November 23, 2025
HYD: జంట జలాశయాల ప్రత్యేకత ఇదే!

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలు నగరవాసుల దాహార్తిని తీరుస్తున్నాయి. మూసీ నది 1908లో భాగ్యనగరాన్ని వరదలతో ముంచెత్తగా.. అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆ వరదలకు అడ్డుకట్ట వేసేందుకు 1920-1926లో మూసీ, ఈసీ నదులపై మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళికతో వంతెనలు నిర్మించారు. అప్పటి నుంచి నగరానికి తాగునీటి సరఫరా చేయడం ప్రారంభించారు.


