News February 19, 2025

రహమత్‌నగర్ ఆస్పత్రిలో కలెక్టర్ అనుదీప్

image

రహ్మత్‌నగర్ డివిజన్ శ్రీ రామ్ నగర్‌లోని గవర్నమెంట్ ఆస్పత్రిని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి పరిశీలించారు. సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. గైనకాలజిస్ట్ డాక్టర్ లేకపోవడం, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన దృష్టికి కార్పొరేటర్ సీఎన్ రెడ్డి తీసుకెళ్లారు. ఎస్పీఆర్ హిల్స్‌లోని క్వారీ ల్యాండ్, వాటర్ రిజర్వాయర్, స్టడీ సర్కిల్‌ని కూడా కలెక్టర్ సందర్శించారు.

Similar News

News March 23, 2025

SUNDAY.. HYDలో ఫ్యాన్స్ జోరు..!

image

హాలిడే రోజు HYD హోరెత్తనుంది. క్రికెట్ ఫ్యాన్స్‌ కోసం ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. గతేడాది సిక్సర్ల మోతతో హోమ్ గ్రౌండ్‌లో రికార్డులు సృష్టించిన SRH ఈ సీజన్‌లో కూడా విధ్యంసం సృష్టిస్తుందని హైదారాబాదీలు ఎదురుచూస్తున్నారు. ‘IPL-18’లో నేడు SRH.. RRతో తలపడనుంది. ఉప్పల్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను హబ్సిగూడ X రోడ్ వద్ద మళ్లిస్తారు. రామంతాపూర్ నుంచి వచ్చే వాహనాలు స్ట్రీట్ నం.8 ద్వారా UPL X రోడ్‌కు మళ్లిస్తారు.

News March 23, 2025

గోల్కొండ: బావికి పూర్వ వైభవం తెస్తే సూపర్

image

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గోల్కొండ కోట బెస్ట్ టూరిస్ట్ ప్లేస్‌గా ప్రసిద్ధిగాంచింది. ఈ క్రమంలో ప్రతిరోజు ఎంతోమంది టూరిస్టులు, నగరవాసులు గోల్కొండ కోటను సందర్శింస్తుంటారు. అయితే గోల్కొండ కోటలో పురాతన బావి ఉంది. ఇది పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. దీంతో చెత్తాచెదారం పేరుకుపోయాయి. అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి బావి పునరుద్ధరించాలని పర్యటకులు కోరుతున్నారు. బావికి పూర్వ వైభవం తెస్తే బాగుంటుందన్నారు.

News March 23, 2025

HYD: ‘నెట్ వర్కింగ్‌ను సద్వినియోగం చేసుకోండి’

image

యువత నెట్ వర్కింగ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఏఐ డేటా ఫెస్ట్ ప్రతినిధి, ప్రముఖ పారిశ్రామిక డేటా నిపుణులు ధావల్ పటేల్ సూచించారు. ఏఐ డేటా ఫెస్ట్ ఆధ్వర్యంలో శనివారం నారాయణగూడలో విద్యార్థులకు, యువతకు నెట్ వర్కింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏఐ డేటా సైన్స్ అనలిటిక్స్‌లో పురోగతులను పరిశోధించడానికి మంచి ఫ్లాట్ ఫారం లా ఇలాంటి వర్క్ షాపులు దోహద పడతాయన్నారు.

error: Content is protected !!