News February 12, 2026

రహేజాకు భూములపై మండలిలో వాడీవేడి చర్చ

image

AP: కంపెనీలకు భూ కేటాయింపులపై శాసన మండలిలో వాడీవేడి చర్చ సాగింది. రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన రహేజాకు 99 పైసలకే భూములు ఎలా ఇస్తారని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స, YCP MLC మాధవరావు ప్రశ్నించారు. విశాఖలోని భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని వరుదు కళ్యాణి మండిపడ్డారు. రహేజా బిల్డింగ్స్‌లో అనేక కంపెనీలు వస్తున్నాయని, వేలాది ఉద్యోగాల కల్పన జరుగుతోందని మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు.

Similar News

News March 15, 2026

నెతన్యాహు చనిపోయారని వార్తలు.. ఇజ్రాయెల్ PMO క్లారిటీ!

image

ఇరాన్ దాడుల్లో నెతన్యాహు చనిపోయారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఇజ్రాయెల్ PMO ఖండించింది. ఈ విషయంపై Anadolu న్యూస్ ఏజెన్సీ ప్రతినిధి సంప్రదించగా క్లారిటీ ఇచ్చింది. ‘అదంతా ఫేక్ న్యూస్. ప్రధాని క్షేమంగా ఉన్నారు’ అని తెలిపింది. నెతన్యాహు కుడిచేతికి 6 వేళ్లు ఉన్న <<19382555>>ఓ వీడియో<<>> SMలో వైరలైంది. అది AI వీడియో అని, ఆయన మరణం గురించి శత్రుదేశానికి తెలియొద్దనే ఆ వీడియో రిలీజ్ చేశారని కొందరు పేర్కొన్నారు.

News March 15, 2026

అంగన్వాడీల్లో చిన్నారులకు పాలు

image

TG: పౌష్టికాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా అంగన్వాడీల్లో చిన్నారులకు ఇకపై పాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి 3-6 ఏళ్ల పిల్లలకు రోజూ 100ML ఇవ్వనుంది. రాష్ట్రంలోని 35,781 అంగన్వాడీల్లో 4.5L మంది పిల్లలు నమోదు చేసుకున్నారు. వీరికి పాలు ఇవ్వాలంటే రోజుకు 45 వేల లీటర్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విజయ లేదా నందినీ డెయిరీ నుంచి మిల్క్ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

News March 15, 2026

ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఉద్యోగాలు!

image

ఇండియన్ నేవీలో అగ్నివీర్(SSR, MR, SSR Medical) పోస్టుల భర్తీకి దరఖాస్తులు మొదలయ్యాయి. ఆసక్తి, అర్హత గల అవివాహిత పురుషులు, మహిళలు APR 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టులను బట్టి టెన్త్, 10+2(మ్యాథ్స్, ఫిజిక్స్) లేదా డిప్లొమా పూర్తిచేసిన వారు అర్హులు. వయసు 17.5-21 ఏళ్లు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, PFT, రాతపరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఫీజు: రూ.550 + GST. వెబ్‌సైట్: joinindiannavy.gov.in