News December 1, 2024
రాంచంద్రంపురం: జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌లతో సమావేశం

హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఆదివారం జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్‌లతో సమావేశం నిర్వహించారు. ప్రజా పాలన విజయోత్సవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈనెల 7,8,9 డివిజన్, నియోజకవర్గాలు, రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి తదితరులు ఉన్నారు.
Similar News
News February 9, 2026
తూప్రాన్: పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎన్నికల పరిశీలకులు

తూప్రాన్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు మంద మకరంద్ సందర్శించారు. ఓటర్లకు కల్పిస్తున్న ప్రాథమిక సదుపాయాలు, తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంప్ సౌకర్యం, క్యూలైన్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా, క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు.
News February 9, 2026
మెదక్: మున్సిపల్ ఎన్నికల పక్రియ సాఫీగా జరగాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల పక్రియ సాఫీగా జరగాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ఎన్నికల అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో జరుగనున్న నాలుగు మున్సిపాలిటీ ఎన్నికలు సాఫీగా జరగాలన్నారు. ఏవైనా ఎన్నికల నిర్వహణ పనులు పూర్తి కాకపోతే రేపు ఉదయం 9 గంటల వరకు పూర్తి చేయాలన్నారు.
News February 9, 2026
మెదక్: సైలెన్స్ పీరియడ్ ప్రచారం వద్దు: ఎస్పీ

మెదక్ జిల్లాలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనా నియమావళి ప్రకారం సోమవారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. సైలెన్స్ పీరియడ్ సమయంలో ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం, మైక్‌లు, లౌడ్ స్పీకర్లు, ప్రచార వాహనాలు, పోస్టర్లు, బ్యానర్లు ఉండరాదని మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస రావు పేర్కొన్నారు.


