News February 12, 2025
రాంబిల్లి: బాలికపై అత్యాచారం.. యువకుడిపై పోక్సో కేసు

అనకాపల్లి జిల్లాలో యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. రాంబిల్లి మండలానికి చెందిన బాలికపై యువకుడు అత్యాచారం చేసినట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేసిందని సీఐ నరసింగరావు మంగళవారం తెలిపారు. ఈ మేరకు విచారణ నిర్వహించి సేనాపతి నాగేంద్ర అనే యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశామన్నారు. నాగేంద్ర ITI చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడని, అతడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News November 25, 2025
మిరపలో జెమిని వైరస్ను ఈ లక్షణాలతో గుర్తించండి

వాతావరణ మార్పుల కారణంగా కొన్నిచోట్ల మిరపలో జెమిని వైరస్ కనిపిస్తోంది. ఇది ఆశించిన మొక్కల ఆకులు చిన్నవిగా మారి పైకి ముడుచుకొని పడవ ఆకారంలో ఉంటాయి. ఆకుల ఈనెలు ఆకుపచ్చగాను, ఈనెల మధ్య లేత ఆకుపచ్చగా లేదా పసుపు పచ్చగా మారుతాయి. కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. దీనికి తోడు కొన్నిచోట్ల పచ్చదోమ కూడా కనిపిస్తోంది. దీని వల్ల మొక్క పెరుగుదల, దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది.
News November 25, 2025
మిరపలో జెమిని వైరస్ను ఎలా నివారించాలి?

జెమిని వైరస్ నివారణకు ముందుజాగ్రత్తగా రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించాలి. వ్యాధిసోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పొలంలో కలుపు మొక్కలను తీసివేయాలి. పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 8 నుంచి 10 అమర్చితే రసం పీల్చే పురుగుల ఉద్ధృతి తగ్గుతుంది. జెమిని వైరస్ నివారణకు లీటరు నీటికి పైరిప్రాక్సిపెన్ 1.5ml లేదా పైరిప్రాక్సిపెన్ + ఫెన్ప్రోపాత్రిన్ 1ml మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
News November 25, 2025
తిరుమల పరకామణి కేసు.. భూమనకు నోటీసులు

AP: తిరుమల పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు హాజరు కావాలంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసులు అందజేశారు.


