News March 3, 2025

రాంబిల్లి: బాలికపై మేనమామ అత్యాచారం

image

రాంబిల్లి మండలంలోని ఓ గ్రామంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై వరుసకు మేనమామ అయిన లాలం రామదాసు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలి తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు రాంబిల్లి సీఐ సీహెచ్ నర్సింగరావు ఆదివారం తెలిపారు. బాలికకు నిందితుడు మాయ మాటలు చెప్పి అత్యాచారం చేశాడని బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొంది.

Similar News

News October 18, 2025

గొల్లప్రోలు: అదృశ్యమైన వ్యక్తి బావిలో శవమై తేలాడు

image

మూడు వారాల క్రితం అదృశ్యమైన వ్యక్తి బావిలో శవమై కనిపించాడు. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన ముర్రే రామకృష్ణ (49) సెప్టెంబరు 24వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీనిపై అతని భార్య ఎల్లావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామ శివారులోని బావిలో శుక్రవారం రామకృష్ణ మృతదేహాన్ని గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 18, 2025

తెలంగాణ బంద్.. వరంగల్ పోలీసుల బందోబస్తు

image

బీసీ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇవ్వడంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు చేపట్టారు. రోడ్లపై ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు, హన్మకొండ, వరంగల్, జనగామ, నర్సంపేట మొదలైన ప్రాంతాల్లోని బస్ డిపోల వద్ద మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

News October 18, 2025

నేటితో ముగియనున్న జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

image

హనుమకొండలోని జేఎన్ఎస్‌లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి అథ్లెక్స్ పోటీల్లో మూడో రోజు ప్రారంభమయ్యాయి. 5000 మీటర్ల పరుగు పందెంలో అథ్లెట్లు పాల్గొన్నారు. చివరి రోజు 23 అంశాల్లో పోటీలు జరగనుండగా,16 అంశాల్లో విజేతలెవరో వెల్లడిస్తారు. సెమీఫైనల్స్‌లో నెగ్గి ఫైనల్స్‌కు చేరుకున్న అథ్లెట్లంతా పతకాల వేట సాగించనున్నారు. ఫైనల్స్ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.