News February 9, 2025
రాంబిల్లి సముద్ర తీరంలో ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

విశాఖకు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు రాంబిల్లి మండలం వాడరాంబిల్లి సముద్ర తీరంలో ఆదివారం మృతిచెందారు. మృతులు కంచరపాలేనికి చెందిన మొక్క సూర్యతేజ, దువ్వాడకు చెందిన మొక్క పవన్‌గా గుర్తించారు. రాంబిల్లి బీచ్‌లో స్నానం చేయడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో అలల తాకిడికి సముద్రంలో మునిగి చనిపోయినట్లు పోలీసు అధికారులు ధ్రువీకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 23, 2026
ఎండల్లో వర్షాలు.. పొంచి ఉన్న జ్వరాల ముప్పు

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పగటిపూట ఎండలు దంచికొడుతుండగా రెండ్రోజుల నుంచి వర్షాలు మొదలయ్యాయి. ఇలా వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల జ్వరం, గొంతునొప్పి, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. వీలైనంత వరకు వర్షంలో తడవకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. తాజా ఆహారంతో పాటు కాచి చల్లార్చిన నీటిని తాగాలంటున్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకుంటే వైరల్ ఫీవర్లు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.
News February 23, 2026
గుంటూరు SP PGRSకు 215 ఫిర్యాదులు

గుంటూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSకు 215 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కుటుంబ వివాదాలు, ఆస్తి, భూ తగాదాలు, రుణ, ఆర్థిక సమస్యలు, మోసపూరిత కేసులు, వ్యక్తిగత, సామాజిక సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వచ్చాయన్నారు. ఫిర్యాదులను సమగ్రంగా విచారించి చట్టపరంగా గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
News February 23, 2026
మెట్రో ఇక సర్కారు సొంతం.. ఎల్&టీతో ‘సెటిల్మెంట్’

TG: హైదరాబాద్ మెట్రో రైలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఎల్&టీకి ఉన్న రూ.13,000 కోట్ల అప్పును ప్రభుత్వమే భరిస్తుందని సమాచారం. అలాగే ఆ సంస్థకు ఈక్విటీ కింద రూ.2,000 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. మార్చి 31 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసి, రెండో దశ విస్తరణకు కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు చర్యలు చేపట్టనుంది.


