News August 19, 2024
రాఖీలు కట్టిన మహిళా ఉద్యోగులు, బ్రహ్మకుమారీలు

రక్షాబంధన్ వేడుకను పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టరేట్లోని వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగులు సోమవారం ఉన్నతాధికారులకు రాఖీలు కట్టారు. బ్రహ్మకుమారీలు, వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు సైతం అధికారులకు రాఖీలు కట్టారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్ తదితర అధికారులకు రాఖీలు కట్టి రక్షా బంధన్ ప్రాశస్త్యాన్ని చాటారు.
Similar News
News October 21, 2025
18 మంది అసువులు బాశారు: NZB CP

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 1986 నుంచి ఇప్పటి వరకు 18 మంది పోలీసులు అసాంఘిక శక్తులతో పోరాడుతూ అసువులు బాశారని CP సాయి చైతన్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 191 మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా తమ కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా పోలీసులు ముందంజలో నిలుస్తున్నారని పేర్కొన్నారు.
News October 20, 2025
NZB: రియాజ్ మృతిపై ప్రమోద్ కుటుంబం హర్షం

నిజామాబాద్ జిల్లాలోని కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతి పట్ల ఆయన భార్య ప్రణీత భావోద్వేగానికి లోనై ఆనందం వ్యక్తం చేశారు. త్వరితగతిన స్పందించిన పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ప్రమోద్ మృతికి న్యాయం జరిగిందని, రౌడీ షీటర్లను ఏరిపారేయాలని ఆమె కోరారు. ప్రమోద్ సోదరి మాధవి, గూపన్పల్లి గ్రామస్థులు సైతం పోలీసుల చర్యను హర్షించారు.
News October 20, 2025
NZB: CP సాయి చైతన్యపై ప్రశంసల వర్షం

CCS కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ను పోలీసులు కాల్చడంతో పోలీసులపై, CP సాయి చైతన్యపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పోలీసులపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘హాట్సాఫ్ పోలీస్’ అంటూ పొగుడుతున్నారు. ‘శివ భక్తుడికి కోపం వస్తే.. అసలైన శివ తాండవమే’ అంటూ సీపీ సాయి చైతన్యను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.