News November 28, 2024

రాఘవరెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ 29కి వాయిదా.!

image

కడప ఎంపీ YS అవినాశ్ రెడ్డి PA బండి రాఘవరెడ్డి తనపై మోపిన అభియోగాలకు సంబంధించిన కేసుపై ముందస్తు బెయిల్ పిటిషన్ కడపలోని జిల్లా కోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై బుధవారం విచారణ జరగాల్సి ఉంది. మెజిస్ట్రేట్ ఈ విచారణను 29కి వాయిదా వేశారు. అదే రోజున ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న వర్రా రవీంద్రారెడ్డిని పోలీస్ కస్టడీకి కోరిన పిటిషన్ విచారణ కూడా జరగనుంది.

Similar News

News May 8, 2025

పెండ్లిమర్రిలో రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే

image

పెండ్లిమర్రి మండలంలోని కొత్తూరు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులను వేంపల్లి శ్రీరాంనగర్‌కు చెందిన బాలయ్య, రాజీవ్ నగర్‌కు చెందిన మల్లికార్జున, మదనపల్లెకి చెందిన మల్లికార్జునగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 8, 2025

పెండ్లిమర్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

image

పెండ్లిమర్రి మండలం కొత్తూరు వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. బైక్‌ను కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరొకరు వేంపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 8, 2025

కడప: రిమ్స్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ జమున

image

కడప రిమ్స్ మెడికల్ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా డాక్టర్ జమున గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం కళాశాల సిబ్బంది ఆమెకు ఘనంగా స్వాగతం పలికి బొకేలు అందజేశారు. రిమ్స్ మెడికల్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె అన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని పేర్కొన్నారు.