News September 21, 2024
రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న ఆకాశ్ పూరీ
మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని సినీ హీరో ఆకాశ్ పూరీ దర్శించుకున్నారు. ఆయనకు శ్రీమఠం అధికారులు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు. గ్రామ దేవత శ్రీ మంచాలమ్మ దేవి, గురు రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీమఠం పీఠాధిపతులు ఫలమంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.
Similar News
News October 15, 2024
కర్నూలు, నంద్యాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
భారీ వర్షాల నేపథ్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కర్నూలు కలెక్టరేట్‌లో 08518-277305, నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో 08514-293903, 08514-293908 నంబర్లను అందుబాటులో ఉంచారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేయాలని అధికారులు పేర్కొన్నారు. 24గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. కాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో బుధ, గురువారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
News October 15, 2024
కర్నూలు జిల్లా మంత్రులకు కీలక బాధ్యతలు
ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, టీజీ భరత్‌లకు CM చంద్రబాబు కీలక బాధ్యతల అప్పగించారు. వీరిని పలు జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులుగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
➤ బీసీ జనార్దన్ రెడ్డి – అన్నమయ్య
➤ ఎన్ఎండీ ఫరూక్ – నెల్లూరు
➤ టీజీ భరత్ – అనంతపురం జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రిగా నియమితులయ్యారు.
News October 15, 2024
కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించింది. క్యాబినెట్‌లోని మంత్రులందరికీ కొత్త జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. కర్నూలు జిల్లాకు నిమ్మల రామానాయుడు, నంద్యాలకు పయ్యావుల కేశవ్ ఇన్‌ఛార్జ్ మంత్రులుగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల్లో ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలును వీరు పర్యవేక్షిస్తారు.