News September 20, 2024
రాఘవేంద్రస్వామి సన్నిధిలో హీరో పూరీ ఆకాష్
మంత్రాలయం రాఘవేంద్రస్వామిని ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు పూరీ ఆకాష్ గురువారం దర్శించుకున్నారు. ఆయనకు శ్రీ మఠం సహాయక పీఆర్ఓ హొన్నొళ్లి వ్యాసరాజాచార్, పురోహితులు కుర్డీ శ్రీపాదాచార్ స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని మంగళ హారతులు స్వీకరించారు. అనంతరం శ్రీ మఠంలో జరిగిన రథోత్సవంలో పాల్గొని రథాన్ని లాగారు.
Similar News
News November 10, 2024
‘మచిలీపట్నం-ధర్మవరం రైలు బెంగళూరు వరకు పొడిగించండి’
నంద్యాల మీదుగా ప్రయాణించే మచిలీపట్నం-ధర్మవరం రైలును బెంగళూరు వరకు పొడిగించాలని సౌత్ వెస్ట్రన్ రైల్వేను దక్షిణ మధ్య రైల్వే కోరింది. ఈ రైలు ధర్మవరం చేరుకున్న తర్వాత 7.40 గంటల పాటు ట్రాక్పై ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఈ రైలును బెంగళూరు వరకు పొడిగించాలని అభ్యర్థించింది. SWR అంగీకారంతో ఇది సాకారం కానుంది.
News November 10, 2024
గుడిసె కృష్ణమ్మకు నిరాశ
సీఎం చంద్రబాబు ప్రకటించిన నామినేటెడ్ పదవుల రెండో విడత జాబితాలోనూ ఆదోనికి చెందిన టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మకు పదవి వరించలేదు. నామినేటెడ్ పదవి దక్కుందని భావించిన కృష్ణమ్మకు మరోసారి నిరాశే మిగిలింది. మంత్రి లోకేశ్ గతంలో చేపట్టిన యువగళం పాదయాత్రలో కృష్ణమ్మకు హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా, ఎమ్మెల్సీ పదవి అయినా దక్కుతుందని ఆమె వర్గం ఆశిస్తోంది.
News November 10, 2024
కర్నూలు, నంద్యాల జిల్లాలో రాష్ట్రస్థాయి బెస్ట్ టీచర్లు వీరే..!
ఉమ్మడి కర్నూలు జిల్లాలో వీరికి రాష్ట్రస్థాయి బెస్ట్ టీచర్ అవార్డులు దక్కాయి. ☞ హెచ్.సత్యనారాయణ రావు (HM, జడ్పీ హై స్కూల్-వెలుగోడు)☞ డా.తొగట సురేశ్ (HM, డోన్)☞ ఎం.ఖాజా బేగ్ (SA-హిందీ, ZPHS ఎస్.బోయినపల్లి, వెల్దుర్తి మండలం)☞ కే.సత్యప్రకాశ్ (SGT, MPPS KASBA బనగానపల్లె)☞ బీ.నాన్సీ మేరీ (SA-సోషల్, ZPHS ఎర్రగుంట్ల, సిరివెళ్ల మండలం)☞ ML ప్రేమకాంత్ బాబు (SGT, MPUPS పుసులూరు, నంద్యాల మండలం)