News June 23, 2024

రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్ల బదిలీ

image

రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ తరుణ్ జోషి ఆదేశాలు జారీ చేశారు. సైబర్ క్రైం విభాగంలో పనిచేస్తున్న ఏ.వెంకటయ్యను కీసర ఎస్‌హెచ్ఓగా, కీసర SHOగా విధులు నిర్వహిస్తున్న కే.సీతారామ్‌ను కందుకూరు ఠాణాకు, కందుకూరు SHOగా పనిచేస్తున్న మక్బూల్ జానీని సైబర్ క్రైం విభాగానికి, యాదాద్రి ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న కే.నాగరాజును మీర్‌పేట్ PSకు బదిలీ చేస్తునట్లు తెలిపారు.

Similar News

News November 24, 2025

26న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం

image

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి టైమ్ ఫిక్స్ అయింది. ఈ నెల 26న అసెంబ్లీలోని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన ఛాంబర్లో నవీన్ యాదవ్‌తో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ పెద్దలు హాజరుకానున్నారు. కాగా, ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ 24,658 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

News November 24, 2025

HYDలో రూ.850 కోట్లు.. ఇందులో మీవీ ఉండొచ్చు!

image

1, 2 కాదు అక్షరాలా రూ.1,150 కోట్లు ఉన్నాయి తీసుకోండి అని వివిధ బ్యాంకుల అధికారులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ప్రజలను కోరుతున్నారు. రూ.850 కోట్ల అన్‌క్లెయిమ్డ్ అమౌంట్ ఈ 2 జిల్లాల్లోని బ్యాంకుల్లోనే ఉంది. హైదరాబాద్ జిల్లాలోని బ్యాంకుల్లో రూ.850 కోట్లు, రంగారెడ్డి జిల్లాలోని బ్యాంకులలో రూ.300 కోట్లు ఉన్నాయి. వచ్చేనెల 31లోపు ఖాతాదారులు, వారి నామినీలుగానీ ఈ మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు.
SHARE IT

News November 24, 2025

HYD: డిజిటల్ ప్రపంచంలో భద్రత తప్పనిసరి: సీపీ

image

హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలకు కీలక సూచన చేశారు. ‘డిజిటల్ ప్రపంచంలో భద్రత తప్పనిసరి. మీ డేటా, మీ జీవితానికి కీలకం. దాన్ని మీరే కాపాడుకోవాలి. డేటా చోరీ జరిగితే, ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1930కు కాల్ చేయండి. లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి’ అని Xలో ట్వీట్ చేశారు.