News July 17, 2024
రాచర్ల: పొలాల్లో పులి సంచారం

రాచర్ల మండలం ఫారం గ్రామ పరిసర పొలాల్లో చిరుతపులి సంచరించినట్లు ప్రజలు గుర్తించారు. గ్రామానికి చెందిన కొందరు పరిసర పొలాల్లో తిరుగుతుండగా పులి అడుగులను కనుగొన్నారు. వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో ఎఫ్ఎస్ఓ జమాల్ బాషా, శ్రీనివాస్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పాదముద్రలను బట్టి పులి సంచరించినట్లు కనిపిస్తోందని, స్పాట్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News July 4, 2025
మార్కాపురం జిల్లాపై మాటెత్తని పవన్..!

మార్కాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటనపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మార్కాపురాన్ని ఎప్పుడు జిల్లా చేస్తామనే దానిపై ఆయన ప్రకటన చేస్తారని ఆశగా చూశారు. కానీ మార్కాపురం జిల్లాపై ఆయన ఏం మాట్లాడలేదు. వెలిగొండ ప్రాజెక్టు భూనిర్వాసితులకు నిధుల కేటాయింపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇవాళ ప్రారంభించిన జలజీవన్ మిషన్ పనులను తానే పర్యవేక్షిస్తూ 20నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పడం కాస్త ఊరటనిచ్చే అంశం.
News May 8, 2025
పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

ఒంగోలు మండలం త్రోవగుంట పొగాకు వేలం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా గురువారం సందర్శించారు. అక్కడ పొగాకు రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. స్పందించిన కలెక్టర్ ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులకు న్యాయమైన ధర వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.
News May 7, 2025
ఒంగోలు: మత్స్యకారులకు మెగా చెక్కును అందజేసిన కలెక్టర్

ప్రతి ఏటా 2 నెలల పాటు ఉండే చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాల జీవనం కోసం ఇచ్చే భృతిని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచినట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. శనివారం ఒంగోలు కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో మెగా చెక్కును మత్స్యకారులకు అందజేశారు.