News April 7, 2025
రాచువారిపల్లెలో విద్యుత్ షాక్తో రైతు మృతి

పుట్టపర్తి మండలంలోని రాచువారి పల్లి గ్రామ సమీపంలో విద్యుత్ షాక్తో రైతు నంబూరి ప్రసాద్ మృతి చెందాడు. సోమవారం గ్రామ సమీపంలోని తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. నియంత్రిక వద్ద ఫీజు ఎగిరిపోవడంతో దానిని వేయడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా షాక్ సర్క్యూట్ కావడంతో అక్కడికక్కడే మృతి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండకు తరలించారు.
Similar News
News November 5, 2025
కాకినాడ: మూడు రోజుల్లో వస్తా అన్నారు.. ఇంకా రాలేదే..!

గత నెల 9న ఉప్పాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా మూడు రోజుల్లో తిరిగి ఇక్కడికి వచ్చి, కాకినాడ నుంచి కోనపాపపేట వరకు బోటులో పర్యటించి కాలుష్య జలాలను పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దాదాపు నెల రోజులు కావస్తున్నా పర్యటనకు రాకపోవడంతో యూ.కొత్తపల్లి మండల మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “డిప్యూటీ సీఎం గారు రండి, ఒక్కసారి కాలుష్యం చూడండి” అని వారు కోరుతున్నారు.
News November 5, 2025
ఏలూరు: మైనారిటీ విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

ఏలూరులోని మైనారిటీల ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో మైనారిటీ (ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు) విద్యార్థులకు టీఈటీ, డీఎస్సీ, ఎస్సై, కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఇన్ఛార్జి కార్యనిర్వాహక సంచాలకులు ప్రభాకరరావు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు www.apcedmmwd.org వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
News November 5, 2025
పశువుల్లో రేబీస్ వ్యాధిని ఎలా గుర్తించాలి?

రేబీస్ వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం వస్తుంది. తర్వాత కేంద్రనాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల పశువులు అసాధారణంగా ప్రవర్తిస్తాయి. కండరాలలోని నరాలు దెబ్బతినడం వల్ల పక్షవాతం సోకుతుంది. మేతను మింగలేకపోవడం, నీటిని చూసి భయపడటం, అధిక లాలాజలం స్రవించడం, బలహీనత, ఎక్కువగా అరవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పశువులను కుక్క కరిస్తే సాధ్యమైనంత త్వరగా వెటర్నరీ డాక్టరు సూచనలతో యాంటీరేబీస్ టీకా వేయించాలి.


