News July 30, 2024
రాజంపేటలో ఘరానా మోసం
పట్టణంలోని ఉస్మాన్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన అకౌంట్‌లో రూ.1500 డిపాజిట్ చేస్తే రూ.1లక్ష ఇస్తామని చెప్పడంతో నమ్మి పలువురు మోసపోయిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. మాయమాటలు నమ్మిన పలువురు రూ.7500 డిపాజిట్ చేశారు. అనంతరం మొబైల్ నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తోందని తెలిపారు. తాము మోసపోయామని బాధిత మహిళలు విలేకర్ల ఎదుట వాపోయారు. అయితే ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు అంటున్నారు.
Similar News
News December 1, 2024
బద్వేల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్‌పై కేసు నమోదు
బద్వేల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోపాలస్వామిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. తమ భూములు గోపాల స్వామి అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారంటూ మేడిమాల సుశీల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నంపల్లిలోని డీకేటీ భూములను ఆధార్ కార్డు ట్యాంపరింగ్‌తో తన పేరుపై రిజిస్టర్ చేసుకున్నడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోపాలస్వామి, సబ్ రిజిస్టర్ రామలక్షుమ్మతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది.
News December 1, 2024
గండికోటలో టోల్ వసూళ్లు దారుణం: DYFI
గండికోటకు వచ్చే పర్యాటకుల నుంచి టోల్ ఫీజు వసూలు చేయడం దారుణమని DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ అన్నారు. కడప DYFI జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గండికోట అభివృద్ధికి దాదాపు రూ.70 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారన్నారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంటే మరోవైపు పర్యాటకుల నుంచి డబ్బులు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
News December 1, 2024
కడప: కోడి కోసం వెళ్లి ఒకరి మృతి
కోడి కోసం వెళ్లిన వ్యక్తి చనిపోయిన ఘటన కడప జిల్లాలో జరిగింది. కొండాపురంలోని వడ్డెవాళ్ల కాలనీకి చెందిన కుడుమల నాగేశ్(52) ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో కోళ్ల కోసం మిద్దె పైకి ఎక్కారు. ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు.