News January 29, 2025
రాజంపేట: ఆకాశంలో ఆవిష్కృతమైన అద్భుత దృశ్యం

అన్నమయ్య జిల్లా రాజంపేటలో బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ఆకాశంలో ఏర్పడిన దృశ్యం కనువిందు చేసింది. నింగిలో అద్భుతం అంటూ పలువురు ఆసక్తిగా చూశారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్ఎల్వీ – ఎఫ్15 రాకెట్ ప్రయోగం ఈరోజు ఉదయం జరిగింది. దాని తాలూకు గుర్తే ఏర్పడినట్లుగా పలువురు భావిస్తున్నారు. వాకింగ్‌కి వెళ్లిన పలువురు ఈ దృశ్యాన్ని తిలకించి చర్చించుకుంటున్నారు.
Similar News
News November 1, 2025
‘గ్లోబల్ స్టార్’ కాదు ‘మెగా పవర్ స్టార్’

రాజమౌళి ‘RRR’ మూవీతో రామ్ చరణ్‌కు గ్లోబల్ స్టార్ ట్యాగ్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘గేమ్ ఛేంజర్’లో అదే ట్యాగ్‌ను మేకర్స్ ఉపయోగించారు. అయితే తాజాగా పెద్ది సినిమా పోస్టర్లో మెగా పవర్ స్టార్ అని కనిపించడం టీటౌన్లో చర్చనీయాంశంగా మారింది. ఇది మంచి నిర్ణయమని కొందరు అంటున్నారు. ట్యాగ్‌లతో వారి స్టార్డమ్కు ఎలాంటి డ్యామేజ్ ఉండదని మరికొందరు చెబుతున్నారు. మీరేమంటారు?
News November 1, 2025
ఎల్ఈడీ యూనిట్లను పర్యావరణహితంగా నిర్వహించండి: కలెక్టర్

ఎల్ఈడీ యూనిట్లను పర్యావరణహితంగా నిర్వహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. శనివారం రావులపాలెం మండలం లక్ష్మీ పోలవరంలోని ఎల్ఈడీ బల్బులు, లైట్ల తయారీ యూనిట్‌ను ఆయన పరిశీలించారు. వాయు, నీటి కాలుష్యాలను నివారించాలని, పర్యావరణానికి హాని కలిగించకుండా చూడాలని నిర్వాహకులకు సూచన చేశారు. తమ యూనిట్లో పలు బ్రాండెడ్ కంపెనీలకు చెందిన బల్బులను తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
News November 1, 2025
గుంటూరులో ఈ నెల 7న జాబ్ మేళా

రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఈ నెల 7న గుంటూరు లాం చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జాబ్ మేళా నిర్వహించనుంది. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించారు. 30కి పైగా కంపెనీలు పాల్గొని వెయ్యికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. 10వ తరగతి నుంచి బీటెక్ చదువుకున్న విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు.


